Hardik Pandya | వాలెంటైన్స్ డే.. గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. అదేంటంటే..?

వాలెంటైన్స్ డే (Valentines Da) సంద‌ర్భంగా 'ఎమ్' అనే అక్షరాన్ని టాటూ (Tattoo)గా వేయించుకుని స్టార్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ మహియెకా శర్మ (Mahieka Sharma)కు అదిరిపోయే గిఫ్ట్ (Valentines Day Gift) ఇచ్చాడు.

Reported by: Tejaswini Nanna | వినోదం | Feb 14, 2026, 5:51 pm IST
Read Time: 4 mins
Hardik Pandya | వాలెంటైన్స్ డే.. గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. అదేంటంటే..?

Hardik Pandya | వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా స్టార్ క్రికెట‌ర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నెట్టింట వైర‌ల్ అవుతున్నాడు. భార్య న‌టాషాతో విడాకుల అనంతరం హార్దిక్.. మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma)తో ప్రేమ‌లో ప‌డిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతున్నారు. పార్టీలు, విదేశీ టూర్లతో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌త కొన్ని రోజులుగా నిత్యం వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు. ఇక నేడు ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ జంట మ‌రోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాండ్యా త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు అదిరిపోయే గిఫ్ట్ (Valentine’s Day Gift) ఇచ్చాడు. కొత్తగా తన మెడ మీద ఓ స‌రికొత్త టాటూ వేయించుకున్నాడు. ‘ఎమ్’ అనే అక్షరాన్ని టాటూగా వేయించుకున్నాడు. ఇది అతడి గర్ల్ ఫ్రెండ్‌లోని మొదటి అక్షరం కావడం విశేషం. ఆమెకు గుర్తుగా దీన్ని టాటూగా వేయించుకుని వాలెంటైన్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రముఖ సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి స్థాపించిన ఎలియన్స్ టాటూ స్టూడియోలో లీడ్ ఆర్టిస్ట్ తుషార్ మరానే స్వ‌యంగా పాండ్యా మెడ‌పై ఓ టాటూ వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

న‌టాషాతో విడాకులు ప్రక‌టించిన అనంత‌రం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేక‌ప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వైర‌లవుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీరిద్దరూ అనేకసార్లు కలిసి కెమెరాకు చిక్కారు కూడా. ఇక ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా తమ ఇన్‌స్టా ఖాతాల్లో షేర్‌ చేస్తూ తమ బంధం గురించి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెల‌కు రూ.2.8ల‌క్ష‌ల సంపాదన‌.. ఐటీ ఉద్యోగుల‌కు కూడా ఇంత జీతం రాదేమో..!
Vaibhav Suryavanshi| వైభవ్ సూర్యవంశీ..పదో తరగతి పరీక్షలకు..!