Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెలకు రూ.2.8లక్షల సంపాదన.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత జీతం రాదేమో..!
డ్రై క్లీనింగ్ షాపు యజమాని (Dry Cleaning Shop) దుస్తులు ఐరన్ చేస్తూ నెలకు రూ.2.8 లక్షల వరకూ సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయన సంపాదన ముందు ఐటీ ఉద్యోగం (IT employees) కూడా దిగదిడుపే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Dry Cleaning Shop | సాధారణంగా ఐటీ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల (IT employees) జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. వారు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తారని భావిస్తుంటాం. చిన్న చిన్న పనులు చేసుకునే వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుందనుకుంటాం. అలా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల కంటే చిరు వ్యాపారుల సంపాదనే ఎక్కువ ఉంటుంది. అందుకు నిదర్శనమే ఈ కథనం.
మన దేశంలో ప్రతీ వీధి చివరనా.. డ్రై క్లీనింగ్ షాపు (Dry Cleaning Shop ) కనిపిస్తుంది. వారు రోజూ దుస్తులు ఐరన్ చేస్తూ జీవితం సాగిస్తుంటారు. వారి కుటుంబం మొత్తం ఈ వృత్తిపైనే ఆధారపడి ఉంటుంది. వారికి ఈ పని తప్ప మరో పని తెలిసి ఉండదు. అయితే, వారి రోజువారి సంపాదన ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా..? వారి ఇన్‌కమ్ మనకు వచ్చే జీతం కంటే డబుల్, ట్రిపుల్ ఉంటుంది. ఒక సాధారణ డ్రై క్లీనింగ్ షాపు యజమాని నెలకు ఏకంగా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆదాయం పదేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీతంతో సమానం కావడం గమనార్హం.
ఐరన్ ద్వారా రోజుకు రూ.3,500
ఈ విషయాన్ని ఓ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. అతను నెలకు రూ.2 లక్షలకు పైనే సంపాదిస్తున్నట్లు సదరు నెటిజన్ తెలిపారు. తమ కాలనీలో చాలా మంది ఆ వ్యక్తి దగ్గరే దుస్తులను ఐరన్, డ్రై క్లీనింగ్ చేయించుకుంటారని వివరించారు. ఆ వ్యక్తి రోజులో దాదాపు 350 పెయిర్స్‌ను ఐరన్ చేస్తాడట. ఒక్కో జతకి రూ.10 తీసుకుంటాడట. అంటే ఇస్త్రీ ద్వారా సుమారు రూ. 3500 సంపాదిస్తాడన్నమాట.
టోటల్ ఇన్‌కమ్ రూ.2.8లక్షలు
వీటితోపాటూ ఖరీదైన వస్త్రాలను కూడా అతడు డ్రై క్లీనింగ్ చేస్తాడు (small business success). ఒక్కో డ్రెస్|శారీకి డ్రై క్లీనింగ్ చేసినందుకు రూ.350 తీసుకుంటాడు. అలా రోజులో దాదాపు 20 దుస్తులను డ్రై క్లీనింగ్ చేస్తాడట. అవి చేసినందుకు మరో రూ.3500 సంపాదిస్తాడట. అంటే రోజులో అతడి సంపాదన దాదాపు రూ.7 వేల వరకూ ఉంటుంది. ఈ లెక్కన అతడు నెలలో 27 రోజులు పనిచేస్తే మొత్తం ఆదాయం సుమారు రూ.2.8 లక్షల వరకూ ఉంటుంది. దుకాణం అద్దె, కరెంటు బిల్లు వంటి ఇతర ఖర్చులు తీసేస్తే అతడికి నెలకు దాదాపు రూ.2 నుంచి 2.3 లక్షల వరకు మిగులుతుందని సదరు నెటిజన్ వివరించారు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు. ఆయన సంపాదన ముందు ఐటీ ఉద్యోగం కూడా దిగదిడుపే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me
— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026
ఇవి కూడా చదవండి :
Tollywood | 2026 టాలీవుడ్ బాక్సాఫీస్ హీట్… మహేష్ బాబు, బన్నీ అభిమానులకి ఎదురు చూపులు తప్పవా?
Airport Cafe | ఇక నుండి ఎయిర్ పోర్టుల్లో టీ రూ.10, సమోసా రూ.20 అంతే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram