Actor Shivaji : మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ
మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల కేసులో నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్సీ నాగబాబు సైతం శివాజీ మాటలను తప్పుబట్టడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది
హైదరాబాద్: మహిళల డ్రెస్సింగ్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో సినీ నటుడు శివాజీ శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇటీవల దండోర సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని, అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ తెలిపింది. సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ వివాదంపై స్వయంగా వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శివాజీ నేడు నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. తాను దండోరా సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో మహిళలపై చేసిన వ్యాఖ్యల అంశంపై వివరణ ఇచ్చారు. శివాజీ వివరణపై మహిళా కమిషన్ ప్రతి స్పందనపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే శివాజీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. తన ఉద్దేశం చెడు కాదని, కొన్ని అభ్యంతరకరమైన పదాలు వాడడం పొరపాటని వివరణ ఇచ్చారు. మరో వైపు మహిళలు, నటిమణుల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుంది. వస్త్ర ధారణ అనేది మహిళల హక్కు అని.. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనెవరని.. అనసూయ, చిన్మయి శివాజీ వ్యాఖ్యలను ఖండించడంతో వివాదం ముదిరింది. శివాజీ మాట్లాడిన భాష, వాడిన పదాలు తప్పేనని.. కానీ ఆయన చేసిన హిత బోధ మంచిదేనని కరాటే కల్యాణి, దివ్వెల మాధురి వంటి కొందరు ఆయనను సమర్థించారు. తాజాగా నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పబట్టారు.
ఇవి కూడా చదవండి :
Hyderabad Drugs Case : మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు!
Actress | ఆ సీన్ వివరిస్తానంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆ తర్వాత ఆరు నెలలకే మరణం..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram