Srihari-Prakash Raj | ప్రకాశ్ రాజ్ – శ్రీహరి మధ్య బంధం ఏమిటి .. వైరల్ అవుతున్న కుటుంబ సంబంధం
Srihari-Prakash Raj | దక్షిణాది సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రకాష్ రాజ్ దశాబ్దాలుగా అనేక భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన, ప్రస్తుతం సహాయ నటుడిగా, విలన్ పాత్రలతోనూ తన నటనకు కొత్త ముద్ర వేస్తున్నారు.
Srihari-Prakash Raj | దక్షిణాది సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రకాష్ రాజ్ దశాబ్దాలుగా అనేక భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన, ప్రస్తుతం సహాయ నటుడిగా, విలన్ పాత్రలతోనూ తన నటనకు కొత్త ముద్ర వేస్తున్నారు. ఇదే సమయంలో దివంగత నటుడు శ్రీహరితో ఆయనకు ఉన్న కుటుంబ సంబంధం గురించి సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో ఇద్దరూ టాప్ యాక్టర్లుగా పేరుపొందిన ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా మందికి తెలియని విషయం కావడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
నటుడు ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి కేవలం సహనటులు మాత్రమే కాకుండా కుటుంబ సంబంధం కూడా కలిగి ఉన్నారు. వీరిద్దరూ తోడల్లుళ్లు అవుతారు. కారణం ఏమిటంటే శ్రీహరి భార్య డిస్కో శాంతి, ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి వరుసగా అక్కాచెల్లెళ్లు. ఈ ఇద్దరూ తమిళ నటుడు సి.ఎల్. ఆనందన్ కుమార్తెలు. డిస్కో శాంతి 1980–90 దశకాల్లో డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందగా, లలిత కుమారి తమిళ చిత్రాల్లో నటిగా నిలిచారు.
1994లో ప్రకాష్ రాజ్, లలిత కుమారి ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. అయితే వారి కుమారుడు చిన్న వయసులోనే మరణించడం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అనంతరం దాదాపు 15 సంవత్సరాల తర్వాత ప్రకాష్ రాజ్ – లలిత కుమారి దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు రెండు కుటుంబాలకూ భావోద్వేగపూరిత సంఘటనగా మారాయి.
ఇటీవల డిస్కో శాంతి, లలిత కుమారి సోదరి సుచిత్ర ఒక ఇంటర్వ్యూలో ఈ కుటుంబ విషయాలను పంచుకున్నారు. తమ కుటుంబంలో మొత్తం ఏడుగురు సంతానం ఉన్నారని, తండ్రి మరణించిన తర్వాత పెద్ద అక్క డిస్కో శాంతి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని అందరికీ అండగా నిలిచిందని తెలిపారు. శ్రీహరి మరణించిన తర్వాత కూడా తమ కుటుంబానికి శాంతి మద్దతుగా నిలిచిందని ఆమె చెప్పారు.
సుచిత్ర మాట్లాడుతూ, తాను మరియు తన తల్లి ఎక్కువగా లలిత కుమారి, ప్రకాష్ రాజ్ దగ్గరే ఉండేవాళ్లమని, అందుకే ప్రకాష్ రాజ్‌పై తనకు ప్రత్యేకమైన అభిమానముందని వెల్లడించారు. శ్రీహరి మరణం, అలాగే లలిత కుమారి – ప్రకాష్ రాజ్ విడాకులు తమ కుటుంబానికి కోలుకోలేని దెబ్బలుగా అనిపించాయని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. ఈ విషయాలు బయటకు రావడంతో ప్రకాష్ రాజ్ – శ్రీహరి మధ్య ఉన్న కుటుంబ బంధం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram