ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారనే కేసులో నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2019లో దిలీప్ కుమార్ అనే లాయర్ ప్రకాష్‌రాజ్‌కు ఒకే టైంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశ్ రాజ్‌కు ఓటు హక్కు ఉందని బెంగళూరు హలసూరు గేటు పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది.
దీనిపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన రాకపోవడంతో..దిలీప్ కుమార్ కోర్టుని ఆశ్రయించాడు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ప్రకాశ్ రాజ్ కు విచారణకు హాజరు కావాలంటూ పలుసార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికి ప్రకాశ్ రాజ్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. విచారణలకు గైర్హాజరవుతుండటంతో బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.