• Telugu News
  • /National

పొడవైన జుట్టులో..భారత యువతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధరియాల్ 271.50 సెం.మీ పొడవైన జుట్టుతో జీవించి ఉన్న మహిళల్లో అత్యంత పొడవైన జుట్టు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 08, 2026, 1:12 pm IST
Read Time: 2 mins
పొడవైన జుట్టులో..భారత యువతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధరియాల్ జీవించి ఉన్న మహిళల్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.ఆమె జుట్టు పొడవు ఏకంగా 271.50 సెం.మీ (8 అడుగుల 10 అంగుళాలు). తంలో ఈ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నస్య్రోవా పేరిట ఉండేది. అలియా 257.33 సెం.మీ జుట్టుతో నెలకొల్పిన రికార్డును రేణు ధరియాల్ అధిగమించింది.

రేణు 2015 నుంచి జుట్టు కత్తిరించుకోకుండా..కెమికల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటూ సహజమైన హెయిర్ ఆయిల్స్, షాంపూలను ఉపయోగిస్తున్నట్లు రేణు తెలిపారు. ఇంట్లో తయారుచేసిన సహజ నూనెలు, షాంపూలతో తన జుట్టును సంరక్షిస్తున్నానని వెల్లడించింది. నేల వరకు ఉన్న తన నల్లటి జుట్టును ఇంట్లో,బయట ప్రదర్శిస్తున్న రేణు ధరియాల్ వీడియో వైరల్ గా మారింది.