ప్రకాష్ రాజ్ ను చంపితే.. బాధ్యత నేను తీసుకుంటా: బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
నటుడు ప్రకాష్ రాజ్‌పై బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త దుమారం మొదలైంది.
హైదరాబాద్ : పదేపదే హిందు మతాన్ని, హిందు దేవుళ్లను, సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను ఎవరైనా చంపితే..ఆ బాధ్యత నేను తీసుకుంటానని రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ను ఎక్కడ దొరికినా నరికేయాలని అందులో నేను ఉంటానన్నారు. నాకు ఏ మతం లేదంటునే..తన కుటుంబ సభ్యులను క్రైస్తవంలో చేర్పించిన ప్రకాశ్ రాజ్ నాస్తికుడు ఎట్లా అవుతాడని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. దేశ వ్యతిరేక కుట్రలలో భాగస్వామిగా మారి..భారత్ దేశంపైన, హిందువులపైన విద్వేషపు మాటలు మాట్లాడడం అలవాటుగా మార్చుకున్నాడన్నారు.
హిందువుల మనోభావాలను విమర్శిస్తున్న ప్రకాశ్ రాజ్ ను మూవీ ఆర్టీస్టు అసోసియేషన్ సినిమాలకు దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. సోరస్ వంటి వారు అందిస్తున్న ఫండ్స్ కు ఆశపడి భారత్ విచ్చిన్నప్రసంగాలుచేస్తున్నాడని ఆరోపించారు. హిందువుల ఆరాధ్య దైవమైన మర్యాద పురుషుడు శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ ను కోర్టులకు లాగాల్సిందేనని, ఎక్కడ దొరికినా నరికేయాలని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..మెట్రో సర్వీసులు పెంపు
కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram