శ్రీరాముడిపై వ్యాఖ్యలు..ప్రకాశ్‌రాజ్‌ వివరణ !

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని నటుడు ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు. శ్రీరాముడిపై తను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ వీడియో విడుదల చేశారు.

శ్రీరాముడిపై వ్యాఖ్యలు..ప్రకాశ్‌రాజ్‌ వివరణ !

విధాత : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని నటుడు ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు. శ్రీరాముడు, సీత, రాము లక్ష్మణులను ఉత్తర భారత వలస కూలీలు అని, వారు దక్షిణాది ఆదివాసీ రావణుడి మామిడి తోటలో పండ్లను దొంగిలించారని, దీనికి పరిహారంగా జీఎస్టీ చెల్లించాలని రావణుడు, శూర్ఫణఖ కోరడంతో యుద్దం జరిగిందని ప్రకాశ్ రాజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హిందు సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసలు వెల్లువెత్తాయి. ప్రకాశ్ రాజ్ పై దేశ వ్యాప్తంగా కేసులు సైతం నమోదయ్యాయి.

దీంతో శ్రీరాముడిపై తను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ వీడియో విడుదల చేశారు. ఇటీవల నేను కేరళలో ఓ లిటరరీ ఫెస్టివల్‌లో మాట్లాడిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని, కొందరు వక్రీకరించారు. అవతారపురుషుడైన శ్రీరాముడి గురించి నేనేదో తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని అంటున్నారన్నారు.

అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. కొందరు రాజకీయ నాయకులు నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు అని పేర్కొన్నారు. ధర్మాన్ని మతోన్మాదంతో ముడిపెట్టి కుహాన రాజకీయాలు చేస్తున్న వారిని నేను ప్రశ్నిస్తున్నందునే నన్ను హిందు వ్యతిరేకిగా ప్రచారం చేస్తున్నారని , వారికి త్వరలోనే సమాధానం చెప్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.