తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం సమస్య తీవ్రతకు హైడ్రా చేపట్టిన ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియ నిదర్శనంగా నిలిచింది. హైడ్రా ఇటీవల DRF అసిస్టెంట్లు (100), హెవీ వెహికల్ డ్రైవర్లు (50) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఈవెంట్స్ ఉంటాయని ప్రకటించింది. దీంతో దరఖాస్తుదారులైన నిరుద్యోగులు శనివారం తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో సరూర్ నగర్ స్టేడియంకు పోటెత్తారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే భారీగా తరలివచ్చిన నిరుద్యోగులను అదుపు చేయలేకపోవడంతో తొక్కిసలాటకు దారితీసింది.
ఉద్యోగాల ఎంపిక కోసం హైడ్రా అభ్యర్థులకు 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్‌పుట్ (7.2 KG) పోటీలను నిర్వహిస్తుంది. ఉద్యోగాలు పొందాలంటే..ఆయా ఈవెంట్లలో అభ్యర్థులు క్వాలిఫై అవ్వాలని హైడ్రా పేర్కొంది.
కేవలం 150 పోస్టులకు ఊహించని రీతిలో వేలాది మంది పోటెత్తడంతో స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నప్పటికీ అధికారుల వైపు నుంచి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో లైన్లలో వేచి ఉన్న యువత.. నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు.
సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట
హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
DRF అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులు
సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటన
170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15… pic.twitter.com/Cg6RlZaOLm
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026