• Telugu News
  • /News

సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ మధ్య రచ్చ..పోటాపోటీగా నీటి విడుదల!

నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఇరు రాష్ట్రాలు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశాయి.

Reported by: Tejaswini Nanna | వార్త‌లు | Aug 26, 2026, 4:08 pm IST
Read Time: 3 mins
సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ మధ్య రచ్చ..పోటాపోటీగా నీటి విడుదల!

నాగార్జున సాగర్ డ్యాం నుంచి నీటి విడుదలకు సంబంధించి మరోసారి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కేఆర్ఏంబి అనుమతీ లేకుండానే అక్రమం కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు. కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతి, సమాచరం లేకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది.

ప్రతిగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కేఆర్ఎంబి అనుమతులు లేకుండానే.. ఇరు రాష్ట్రాల అధికారులు సాగర్ డ్యాం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల చేయడం వివాదస్పదంగా మారింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు విడుదల చేసినందునా..ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.