Ibomma Ravi | ‘గుర్తు లేదు.. మర్చిపోయా’.. విచారణలో ఐబొమ్మ రవి సమాధానం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులోకి తాజాగా తెలంగాణ సీఐడీ అధికారులు రంగప్రవేశం చేశారు.
విధాత, హైదరాబాద్ :
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులోకి తాజాగా తెలంగాణ సీఐడీ అధికారులు రంగప్రవేశం చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై సీఐడీ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో నిందితుడు అయిన ఐబొమ్మ నిర్వాహకుడు రవికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తుండగా తాజాగా సీఐడీ ఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
మరోవైపు నిందితుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడో రోజు విచారించారు. అనంతరం క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ విచారణ తీరుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. విచారణకు రవి సహకరించకుండా.. యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌లు అడిగితే గుర్తు లేదు.. మర్చిపోయా అని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిపారు. వివరాలు రాబట్టేందుకు రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లను పోలీసులు ఓపెన్ చేసెందుకు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో సర్వర్ ఐపీలు ఉన్నాయన్నారు. ప్రతి 20 రోజులకు ఒకసారి రవి విదేశాలకు వెళ్తాడన్నారు. రవి బ్యాంక్ అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram