Wild Elephant : నగరంలో ఏనుగు విధ్వంసం !

ఝార్ఖండ్ రాజధాని రాంచీలోకి దారి తప్పిన ఏనుగు నగరంలో బీభత్సం సృష్టించింది. వాహనాలు ధ్వంసం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 27, 2026, 7:02 pm IST
Read Time: 3 mins
Wild Elephant : నగరంలో ఏనుగు విధ్వంసం !

విధాత : అడవుల్లో ఉండాల్సిన గజరాజు మంద నుంచి దారి తప్పి అనూహ్యంగా నగరంలోకి ప్రవేశించింది. నగరానికి వచ్చిన ఏనుగుకు ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో నానా బీభత్సం సృష్టించింది. రోడ్లపై వాహనాల ధ్వంసం చేస్తూ అందరిని పరుగులు పెట్టించింది.

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు విధ్వంసం సృష్టించింది. రోడ్డుపై తిరుగుతూ వాహనాలను తొక్కుకుంటూ పోయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. అక్కడికి చేరుకుని ఏనుగును కంట్రోల్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా ఇలాగే ఓ ఏనుగు దారి తప్పి రాంచీ పట్టణంలోకి వచ్చి చేసిన బీభత్సన్ని అందరు తలుచుకుని భయంతో పరుగులు తీశారు. అప్పట్లో ఆ గజరాజు ఏకంగా ఐదు జిల్లాల్లో సంచరిస్తూ 12 రోజుల్లో 16 మందిని పొట్టనబెట్టుకుంది. రాంచీ జిల్లాలోని ఇట్కీ బ్లాక్ లో ఒకే రోజు నలుగురిని హతమార్చింది.

జార్ఖండ్ ఏనుగులకు సానుకూల అవాసంగా కొనసాగుతుంది. అయితే గత దశాబ్దా కాలంగా అక్రమ మైనింగ్ పెరిగిపోవడం, అటవీ ప్రాంతాల గ్రామాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, ఏనుగుల స్వేచ్ఛాయుత కదలికకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అంతేకాక బొగ్గు గనుల ప్రాజెక్టులు ఏనుగుల సహజ కారిడార్ ను ప్రతికూలంగా మారాయి. దీంతో ల అటవీ ప్రాంతాల నుంచి అడవి ఏనుగులు తరుచూ దారి తప్పి జనావాసాల వైపు వస్తున్నాయి. దీంతో మానవ-జంతు సంఘర్షణకు ఏర్పడుతుండగా..అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో 400మంది వరకు ఏనుగుల దాడిలో మరణించినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి :

Type-2 Diabetes | స్టెమ్ సెల్ థెరపీతో టైప్–2 డయాబెటిస్‌ రివర్స్‌.. చైనా కీలక ఆవిష్కరణ
Cheetah Meals | ఏడాదిలో రూ.1.27 కోట్ల మేక‌ల్ని తిన్న చీతాలు