• Telugu News
  • /National

Elephant Attack| నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్

తన ఆవాసమైన అడవిలోకి వచ్చిన సందర్శకులపై గజరాజు ఆగ్రహించారు. నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా? అంటూ ఏనుగు వారిని అడవి నుంచి తరిమే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 03, 2026, 6:22 pm IST
Read Time: 4 mins
Elephant Attack| నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్

విధాత: అడవులు వన్యప్రాణుల ఆవాసం. నానాటికి మనుషులు తమ అవసరాలు..సహజ వనరుల అన్వేషణల కోసం అడవులను నాశనం చేస్తూ వన్యప్రాణుల మనుగడకు సవాల్ విసురుతున్నారు. తరిగిపోతున్న అడవులతో ఆవాసం కోల్పోతున్న వన్యప్రాణులు తరుచూ జనావాసాల్లో బీభత్సం చేస్తుండటం చూస్తున్నాం. లేకపోతే అవి అడవుల్లోనే..మనుషులు గ్రామాలు, నగరాల్లోనే ఎవరి జాగాల్లో వారు ఉంటారు. ఓ అడవిలోకి వచ్చిన సందర్శకులపై గజరాజు ఆగ్రహించారు. నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా? అంటూ ఏనుగు వారిని అడవి నుంచి తరిమే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

తాజాగా భారత్ లోని ఆభయారణ్యంలో ఓ మట్టిదారిలో సందర్శకులు సఫారీ ట్రిప్ వెళ్లారు. అదే సమయంలో అడవిలో ఓ గజరాజు ఆ వాహనాన్ని చూసి మా అవాసంలోకి మీరెందుకు వచ్చారు..మా ప్రశాంతతను చెడగొడుతున్నారన్నట్లుగా సందర్శకులపై ఫైర్ అయ్యింది.  భీకరంగా ఘీంకరిస్తూ…  ఆగ్రహంతో సందర్శకుల సఫారీ జీపుపైకి దాడికి దిగింది. భయంతో సఫారీ సిబ్బంది వాహనాన్ని వెనక్కి నడిపించినప్పటికి గజరాజు మాత్రం అలాగే వెంటాడాడు. సిబ్బంది జీపు ఆపి ఏనుగును అదిలించే ప్రయత్నం చేశాడు. కొంత వెనక్కి తగ్గినట్లుగా చేసిన గజరాజు జీపు మళ్లీ ముందుకు సాగగానే మళ్లీ జీపును తరుముతూ వెంటాడింది. ఆ ఏనుగు తన సమీపంలో ఉన్న గున్న ఏనుగును రక్షణ కోసం ఇలా సఫారీ వాహనంపైకి దాడికి వచ్చినట్లుగా సఫారీ సిబ్బంది పేర్కొన్నారు.

ఈ ఘటన మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షనకు నిదర్శనంగా నిలిచింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సం మార్చి 3న ఈ వీడియో వైరల్ గా మారింది. భారత్ లో ఓ నివేదిక మేరకు ఏనుగుల దాడిలో గత ఐదు సంవత్సరాలలో 2,500 మందికి పైగా మరణించినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.