China Manja child killed| చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా

సంక్రాంతి పండుగ ముగిసిపోయినప్పటికి రోడ్లపైన, వీధుల్లో చైనా మాంజా హింసాకాండ ఆగడం లేదు. తండ్రితో కలిసి బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి ఐదేళ్ల చిన్నారి నిష్వికాదిత్య తీవ్ర గాయాలై మరణించింది.

China Manja child killed| చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా

విధాత, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ ముగిసిపోయినప్పటికి రోడ్లపైన, వీధుల్లో చైనా మాంజా హింసాకాండ ఆగడం లేదు.సోమవారం సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ సమీపంలో మెట్రో పిల్లర్ 781వద్ద చైనా మాంజాకు ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది.

తండ్రితో కలిసి బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి ఐదేళ్ల చిన్నారి నిష్వికాదిత్య తీవ్ర గాయాల పాలైంది. సమీప ఆసుపత్రికి తరలించలోగానే అప్పటికే పాప మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.