SSMB29 : రాజమౌళి సినిమాలో శ్రీరాముడిగా మహేష్ బాబు!

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో సంచలనం రేపుతోంది.

SSMB29 : రాజమౌళి సినిమాలో శ్రీరాముడిగా మహేష్ బాబు!

విధాత : ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ అడ్వంచర్ ఎస్ఎస్ఎంబీ 29(వర్కింగ్ టైటిల్) సినిమా నిర్మాణ దశలోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఒకటి ఇటీవల కెన్యా దేశం అభయారణ్యాలు.. మాసాయి మారా మైదానాలు, నైవాషా సరస్సు, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రసిద్ధ ప్రాంతాలలో పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేన్యా మంత్రి ముసాలియా ముదావది తమ దేశంలోని సుందర ప్రదేశాలు ఈ సినిమా ద్వారా 120దేశాలకు పరిఛయం కానుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తద్వారా మహేష్ బాబు సినిమా ఎన్ని దేశాల్లో విడుదల కానుందన్న సంగతిని చెప్పకనే చెప్పారు.

ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వైరల్ అవుతోంది. మహేష్ బాబును ఈ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీరాముడు గెటప్ లో చూపించబోతున్నాడన్న వార్త సినీ సర్కిల్ లో రచ్చ రేపుతుంది. శ్రీ రాముడి గెటప్ కు సంబంధించిన మహేష్ బాబు సన్నివేశాలను ఇదివరకే షూట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అదే నిజమైతే ఎస్ఎస్ఎంబీ సినిమా వెండితెరపై ఎన్ని రికార్డులకు వేదిక కానుందోనంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌ ఫస్ట్ లుక్‌ను నవంబరులో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

వాస్తావానికి రణబీర్ కపూర్ హీరోగా నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న బాలీవుడ్ రామాయణ్ లో మొదట శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించారని..అప్పటికే రాజమౌళి సినిమా కోసం డేట్స్ ఇచ్చి ఉండటంతో ఈ సినిమా రణబీర్ వద్దకు వెళ్లింది. కొంతకాలంగా శ్రీరాముని అవతారంలో ఉన్న మహేష్ బాబు ఏఐ ఇమేజెస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజమౌళి సినిమాలో రాముడిగా కనిపించబోతున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మిరాయ్ లో శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారన్న ప్రచారం జరిగిన దానిని ఆ చిత్ర యూనిట్ ఖండించింది. ఇప్పుడు రాజమౌళి సినిమాలోనే మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.