Lions vs Hyenas Battle| హైనాల గుంపుతో సింహాల దండు పోరు వైరల్

అడవిలో వన్యప్రాణుల మధ్య ఆహార సాధన కోసం జరిగే పోరాటాలు అప్పుడప్పుడు సందేశాత్మకంగా కూడా కొనసాగుతుంటాయి. అడవిలో గుంపులుగా దాడి చేసే హైనాలు ఓ సింహంపై దాడి చేసి చంపి తినేందుకు ప్రయత్నించడం...ఆ సింహాన్ని కాపాడేందుకు సింహాల గుంపు ప్రతిదాడికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Lions vs Hyenas Battle| హైనాల గుంపుతో సింహాల దండు పోరు వైరల్

విధాత: అడవిలో వన్యప్రాణుల మధ్య(Wild life Battle) ఆహార సాధన కోసం జరిగే పోరాటాలు అప్పుడప్పుడు సందేశాత్మకంగా కూడా కొనసాగుతుంటాయి. అడవిలో పులి, సింహాల దాడులను అడవి దున్నలు సమిష్టిగా తిప్పికొట్టడం చూస్తుంటాం. అడవిలో గుంపులుగా దాడి చేసే హైనాలు(Hyenas) ఓ సింహం(Lion)పై దాడి చేసి చంపి తినేందుకు ప్రయత్నించడం…ఆ సింహాన్ని కాపాడేందుకు సింహాల గుంపు ప్రతిదాడికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా(Viral Video) మారింది. అడవిలో పచ్చిక బైళ్లలో వెలుతున్న ఓ సింహంపై హైనాల గుంపు(Hyenas Group) ఆహార కోసం దాడి చేసింది.

హైనాల మూకుమ్మడి దాడిని ప్రతిఘటించడంలో సింహం శక్తికి మించిన పనిగా మారింది. ఇంకొద్ది సేపట్లో అది హైనాల దాడిలో హతమయ్యే పరిస్థితిలో ఉండగా…సమీపంలోని సింహాల గుంపు(Lions Group)పరుగున వచ్చి ఆ సింహాన్ని రక్షించాయి. హైనాల గుంపుపై సింహాలు సైతం గుంపుగానే దాడి చేసి హైనాలను తరిమేశాయి. దీంతో అపాయంలో ఉన్న సింహం రక్షించబడగా…సింహల దాడికి హైనాలు పరుగు లంఘించుకున్నాయి. ఈ దాడి పరిణామం..సమిష్టి పోరాటమే విజయ సోపానం..కలిసి ఉంటే కలదు బలిమి అన్న సూక్తులను గుర్తు చేశాయి.