Tiger-Lion Friendship| సివంగితో పులి స్నేహమా..!..ఎందుకలా..?

Tiger-Lion Friendship| సివంగితో పులి స్నేహమా..!..ఎందుకలా..?

Wildlife Rare Moments: పులులు(Tigers) ఒంటరి జంతువులు, అవి విశాలమైన వ్యక్తిగత స్థలాన్ని ఇష్టపడతాయి. సింహాలు(Lions) సామాజిక జంతువులు..ఎక్కువగా జతజతలుగా సంచరిస్తుంటాయి. ఈ రెండూ తమ సహజ వైరాలను..తేడాలను మరిచి అడవిలో స్నేహితులుగా మారితే అది నిజంగా అశ్చర్యకరమే (wildlife rare moments). అలా ఓ ఆడసింహం(సివంగి Lion), ఓ పెద్దపులి(Tiger) అనుకోకుండా అరణ్యంలో తారసపడ్డాయి. ఓ నీటి కుంట వద్ధ నీళ్లు తాగేందుకు సివంగి వచ్చింది. అప్పటికే ఆ నీటిలో ఓ పెద్దపులి దర్జాగా సేదతీరుతుంది.

సివంగిని చూసిన పులి ఒక్కసారిగా గర్జించి దానిమీదకు వెళ్లింది. సివంగి ఏ మాత్రం భయపడకుండా దాని వద్దకు చేరింది. తొలుత రెండు కూడా ఫైటింగ్ పోజిషన్ తీసుకున్నప్పటికి అంతలోనే వాటి మధ్య పూర్వ పరిఛయం ఏదో ఉన్నట్లుగా సయ్యాటలకు సరసాలకు దిగి ముద్దు ముచ్చటలాడుకున్నాయి. నీళ్లు తాగిన తర్వాతా సివంగి తన దారిన తాను వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎదురుపడితే భీకర ఘర్షణకు దిగే మృగరాజులు ఇలా అనూహ్యంగా అచ్చిక బుచ్చికలాడుకోవడం చూసిన నెటి జన్లు అవి సీజ్ ఫైట్ పాటిస్తున్నాయని కొందరు..బలమైన మనం కొట్టుకుంటే ఒరిగేదేముంటుంది..బలహీన ప్రాణులను వేటాడితే మేలనుకుని ఉంటాయని మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.