Viral Videos | టామ్ కాదు సింహం.. వేటలో జారిపడింది పాపం!

అడవిలో వేట అంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి ఆహారం కోసం వేటాడుతుంటే.. మరో జీవి తన జీవితం, ప్రాణం కోసం తప్పించుకోవాలని పోరాడుతుంది.

Viral Videos | టామ్ కాదు సింహం.. వేటలో జారిపడింది పాపం!

అడవిలో వేట అంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి ఆహారం కోసం వేటాడుతుంటే.. మరో జీవి తన జీవితం, ప్రాణం కోసం తప్పించుకోవాలని పోరాడుతుంది. అందులో సింహాల వేట గురించి చెప్పక్కర్లేదు. ఎంతో ఉగ్రతతో సాగే సింహం వేటను చూస్తే అలా ఆశ్చర్య పోవాల్సిందే. కానీ, ఈసారి సింహం వేటాడుతున్న వీడియో మాత్రం నవ్వుల పూలు పూయించింది. ఈ వీడియోలో నీళ్లు తాగడానికి వచ్చిన జింక.. ప్రశాంతంగా నీరు తాగుతోంది. ఈ క్రమంలో ఏదో చిన్న అలజడి రేగింది.. జింక తేరుకునే లోపే సింహం వేగంగా వచ్చి జింకపైకి దూకింది.

కానీ, జింక ఛలో అంటూ ఖోఖో గేమ్ ఆడింది. సింహం వేగానికి తన టెక్నిక్ ను వాడి తన జీవితాన్ని నిలుపుకుంది. నీటి దగ్గర వున్న ఓ మృగంపై దూకిన సింహం, ఎండిన మట్టి మీద పరిగెడుతూ అకస్మాత్తుగా బ్యాలెన్స్‌ కోల్పోయి జారిపడింది. దుమ్ము మేఘంలో సింహం తడబడి ఉండగా, ఆ మృగం మాత్రం నీటిలోకి దూకి తప్పించుకుంది. “సింహం ఎండ్లెస్‌ స్కిడ్‌” అంటూ పేజీ పెట్టిన క్యాప్షన్‌తో ఆ వీడియో వేగంగా వైరల్‌ మారింది. దీన్ని చూస్తే టామ్ అండ్ జెర్రీ సిన్ లా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.