Jaguar Attacks Crocodile | చిరుత..మొసలి ఫైట్..గూస్ బంప్స్..!

జాగ్వార్ జాతి చిరుత vs కైమన్ మొసలి మధ్య నది ఒడ్డున సాగిన మరణ పోరాటం వీడియో వైరల్. గూస్ బంప్స్ తెప్పించేలా సాగిన ఈ ఫైట్‌లో పైచేయి ఎవరిదో చూడండి!

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Nov 27, 2025, 8:43 pm IST
Read Time: 3 mins
Jaguar Attacks Crocodile | చిరుత..మొసలి ఫైట్..గూస్ బంప్స్..!

Jaguar Attacks Crocodile | వన్య మృగాలలో పెద్దపులి, సింహం బలంతో వేటాడే జంతువులు. అయినప్పటికి చిరుతకు ఉండే వేగం..నైపుణ్యం భూమిపై వేటలో దానిని అగ్రస్థానంలో నిలబెడుతుంది. అలాగే స్థాన బలంతో..నీటిలో వేటాడటంలో బలమైనదిగా మొసలిని చెబుతారు. యాదృచ్చికంగా చిరుత, మొసలి పరస్పరం నీటిలో తలపడిన ఘటన వీడియో వైరల్ గా మారింది. నీటిలో..ఒడ్డున అవి సాగించిన పోరాటం చూసి తీరాల్సిందే.

ఓ కైమన్ జాతి మొసలి నది ఒడ్డున పొంచి ఉంది. ఎక్కడ నుంచి చూసిందోగాని సమీపంలో ఉన్న జాగ్వర్ జాతికి చెందిన చిరుత పులి మొసలిని చూసి వేగంగా దానిపై దాడి చేసింది. వేగంగా పరుగెత్తుకొచ్చి నీటిలోకి దూకి..అంతే వేగంగా ఈదుతూ మొసలిని నోట కరుచుకుంది. చిరుత ఆకస్మిక దాడి నుంచి బయటపడేందుకు..దానిని నీటిలోనే మట్టుబెట్టెందుకు మొసలి కూడా తన పోరాటం సాగించింది. ఈ క్రమంలో ఆ రెండు నీటిలో, ఓడ్డున సాగించిన పోరాటం గుస్ బంప్స్ తెప్పించేలా సాగింది. మొసలితో పోరాటంలో నీటిలో మునిగినప్పటికి చిరుత తన పట్టును విడువకుండా మొసలిని నోట గట్టిగా పట్టుకుంది. అటు మొసలి సైతం నీటిలో నుంచి బయట పడితే తన పని ఖతం అని తెలిసి తనను ఒడ్డుకు లాక్కెళ్లకుండా చిరుతను ప్రతిఘటించింది. చివరకు రెండు అలసిపోయి నది ఒడ్డుకు చేరగా..ఈ పోరాటంలో అనూహ్యంగా చిరుత పులిదే పైచేయి అయ్యింది. అయితే పెద్ద కైమన్ జాతి మొసళ్లు మాత్రం చిరుతను మట్టుబెట్టేవని నిపుణులు చెబుతున్నారు.

Read Also |

Sea Snakes | భయంకరమైన సముద్ర పాముల గురించి తెలుసా?
Tooth Regrowth : డెంటల్ ట్రీట్మెంట్ లో విప్లవాత్మక మార్పు!
Renaming IIT Bombay : ఐఐటీ బాంబే పేరుపై వివాదం