Bollywood Heroes: బాలీవుడ్ హీరోలను వదలని కృష్ణ జింకల కేసు!

Bollywood Heroes: బాలీవుడ్ హీరోలను వదలని కృష్ణ జింకల కేసు!

Bollywood Heroes: రాజస్థాన్ లోని బిష్ణోయ్ తెగ ఆరాధ్యదైవంగా భావించే కృష్ణ జింకలను వేటాడిన కేసు 27ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సైఫ్ అలిఖాన్, దుశ్యంత్ సింగ్, సీనియర్ హీరోయిన్లు టబూ నీలం, సోనాలీ బింద్రేలను వెంటాడుతునే ఉంది. తాజాగా ఈ కేసులో సైఫ్ అలిఖాన్,  టబూ, నీలం, సోనాలీ బింద్రే, స్థానికుడు దుశ్యంత్ సింగ్ లను నిర్థోషులుగా పేర్కొంటూ గతంలో జోద్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అటు సల్మాన్ ఖాన్ తన జైలు శిక్షను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.

హమ్ సాథ్ సాథ్ హై హై చిత్రం షూటింగ్ సందర్భంగా 1998 అక్టోబర్ 1న జోధ్ పూర్ పరిసర ప్రాంతంలోని కంకణీ గ్రామ సమీపంలో సల్మాన్ ఖాన్, సహానటులు సైఫ్ అలిఖాన్,  టబూ, నీలం, సోనాలీ బింద్రే కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంలో సల్మాన్ ఖాన్ పై భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51, సైఫ్ అలిఖాన్, టబూ, సొనాలీ బింద్రే, నీలం, దుశ్యంత్ సింగ్ లపై సెక్షన్ 51 రెడ్ విత్ సెక్షన్ 149కింద కేసులు నమోదయ్యాయి. జోధ్ పూర్ కోర్టులో ఈ కేసుల విచారణ కొనసాగింది. 2018లో కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మిగతా ఐదుగురిని నిర్ధోషులను, వారు వేటాడలేదని పేర్కొంది. జింకలను చంపడం మానవత్వం కాదని..సల్మాన్ జింకలను కాల్చినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని పేర్కోంది.

అయితే కృష్ణ జింకల వేట కేసులో నటులు సైఫ్ అలీ ఖాన్, టబూ, నీలం, సోనాలీ బింద్రే, దుశ్యంత్ సింగ్ లను గతంలో జోద్ పూర్ కోర్టు నిర్దోషిలుగా తేల్చుతూ ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్..ఇదే కేసులో పెండింగ్ లో ఉన్న మిగతా పిటిషన్ లతో కలిపి దీనిని విచారిస్తామని తెలిపారు. సంబంధిత పెండింగ్ కేసులతోపాటు లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 28 కి వాయిదా వేశారు.

ఇందులోనే బదిలీ పిటిషన్ అనుమతులు, సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్షకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో చేర్చింది. రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పిల్ పిటిషన్ తో కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి ఈ బాలీవుడ్‌ నటులు చిక్కుల్లో పడ్డారు. అటు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ సైతం తమ ఆరాధ్య దైవం కృష్ణ జింకలను చంపిన సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటు ప్రకటించడంతో భారీ భద్రత మధ్య సల్మాన్ రోజులు వెళ్లదీస్తున్నారు.