Tortoise Stops Lion From Drinking Water | సింహం సహనానికి తాబేలు పరీక్ష
దప్పికతో నీళ్లు తాగుతున్న సింహం సహనానికి ఒక బుల్లి తాబేలు పరీక్ష పెట్టిన వీడియో వైరల్ అయింది. నీటి మడుగు వద్ద సింహం ముఖానికి అడ్డు పడుతూ తాబేలు చికాకు పెట్టినా, సింహం కోపం తెచ్చుకోకుండా శాంతంగా నీరు తాగి వెళ్లిపోయింది. సింహం సంయమనం అందరినీ ఆశ్చర్యపరిచింది.
విధాత : సింహం అడవికి రాజు. సింహం బలం ముందు గజరాజులు, పెద్ద పులులు సహా ఇతర వన్యప్రాణులన్ని తలొగ్గక తప్పదు. అంతటి బలవంతమైన సింహం సహనానికి ఓ బుల్లి తాబేలు పరీక్ష పెట్టిన వీడియో వైరల్ మారింది. ఓ అడవిలో దప్పికగొన్న భారీ సింహరాజం ఓ నీటి మడుగు వద్దకు వచ్చి నీళ్లు తాగడం ఆరంభించింది. అదే నీటి మడుగులో ఉన్న ఓ చిట్టి తాబేలు సింహం నీళ్లు తాగుతుంటే దాని నోటి వద్దకు వచ్చి అడ్డుతగలడం మొదలు పెట్టింది. సింహం తన తలను పక్కకు జరిపి నీళ్లు తాగేందుకు ప్రయత్నించడం..తాబేలు మళ్లీ అడ్డుపడుతూ చీకాకు తెప్పించడం సాగింది.
చివరకు సింహం నీటి మడుగు వద్ద నుంచి పక్కకు జరిగి మరో వైపు నీళ్లు తాగే ప్రయత్నం చేసింది. తాబేలు వదిలిపెట్టకుండా వెంటపడి సింహం మడుగులో నీళ్లు తాగుతుంటూ మళ్లీ అడ్డుపడింది. ఓ చిట్టి తాబేలు తనను ఎంత చికాకు పరిచినా ఆ సింహం మాత్రం కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా నీళ్లు తాగి వెళ్లిపోయింది. నిజానికి సింహానికి కోపం వస్తే తన పంజాతో ఒక్కటిచ్చినా ఆ తాబేలు ఎక్కడో ఎగిరిపడేది. లేదంటే నోట కరుచుకుని వదిలేసిన చచ్చి బతికేది. అయినప్పటికి సింహం ఆ చిట్టి తాబేలును ఏమి అనకుండా ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది.
— Nature🍀🌸 (@NatureNexus4321) October 24, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram