Hyderabad | నేడు హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం..!
Hyderabad | ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.
Hyderabad | ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. బోడుప్పల్ సర్కిల్ -10 పరిధిలోని బృందావన్ ఫీడర్‌లో సోమవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు, బృందావన్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సాయిమారుతి నగర్, కేశవనగర్, ఉదయలక్ష్మీ నగర్, మేయిన్ రోడ్డు సిద్ధార్థ్ స్కూల్ ఏరియా, ఆకృతి టౌన్ షిప్ ప్రాంతాలు, ఉదయనగర్ ఫీడర్ పరిధిలోని ఈస్ట్ బృందావన్ కాలనీ, వెస్ట్ బృందావన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సత్తిరెడ్డి కాలనీల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుందని అధికారులు ప్రకటించారు.
పీర్జాదిగూడ డివిజన్ పరిధిలోని సబ్ స్టేషన్ 3311 కేవీ విద్యుత్ ఫీడర్ ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాఘవేంద్ర నగర్ కాలనీ, మల్లికార్జున్ నగర్ కాలనీ, అరోరా కాలేజీ ఏరియా, భాగ్యనగర్ కాలనీతో పాటు వరంగల్ జాతీయ రహదారిలో విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram