• Telugu News
  • /National

బడికి వెళ్లాలంటే తాళ్ల వంతెన ట్రాలీ సాహసయాత్ర చేయాల్సిందే..!

ఉత్తరాఖండ్ లోని విద్యార్దులకు రోజు బడికి వెళ్లే ప్రయాణం...నిత్య సాహస యాత్రగా మారిపోయింది. పితోరాఘర్-బాగేశ్వర్ ప్రాంతాలను కలిపే వంతెన 2018 వదరల్లో కొట్టకుపోయింది. నాటి నుంచి ఎన్నికలు వచ్చిపోయినా.. ప్రభుత్వాలు మారినా..నేటికి కొట్టుకపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన మాత్రం నిర్మించలేదు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 12, 2026, 2:04 pm IST
Read Time: 4 mins
బడికి వెళ్లాలంటే తాళ్ల వంతెన ట్రాలీ సాహసయాత్ర చేయాల్సిందే..!

విధాత : నదులు, లోయలు, కొండ ప్రాంతాలతో కూడిన భూభాగం అధికంగా ఉండే ఉత్తరా ఖండ్ రాష్ట్రాన్ని ‘దేవభూమి’ అని కూడా పిలుస్తారు. డెహ్రాడూన్ దీని రాజధాని. హిమాలయాల ఒడిలో ఉన్న ఈ రాష్ట్రం ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఓ ప్రాంత విద్యార్థులకు మాత్రం కష్టాలకు నెలవుగా తయారైంది. అక్కడి విద్యార్దులకు రోజు బడికి వెళ్లే ప్రయాణం…నిత్య సాహస యాత్రగా మారిపోయింది. పితోరాఘర్-బాగేశ్వర్ ప్రాంతాలను కలిపే వంతెన 2018 వదరల్లో కొట్టకుపోయింది. నాటి నుంచి ఎన్నికలు వచ్చిపోయినా.. ప్రభుత్వాలు మారినా..నేటికి కొట్టుకపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన మాత్రం నిర్మించలేదు.

దీంతో చిన్నారులు ప్రాణాలను పణంగా పెట్టి తాళ్ల(రోప్) వంతెనపై తాత్కాలిక ట్రాలీల్లో ప్రమాదకరంగా నదిని దాటి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం వారు ఈ సాహసాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ నదిని దాటి పాఠశాలకు, ఇంటికి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు తలెత్తినా విద్యార్ధులకు ప్రమాదం ఎదురుకాకతప్పదు. అయిన్పటికి పాలకుల మనసు కరిగి…వంతెన నిర్మాణ దిశగా చర్యలు తీసుకోలేకపోతుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరాఖండ్ లో వరుసగా రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రభుత్వాల డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికి నదిపై చిన్న వంతెన నిర్మించలేకపోతుండటం పాలకుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తుందని విమర్శిస్తున్నారు.