విధాత, హైదరాబాద్ : పెంపుకు కుక్కలు, జంతువులకు స్నానం చేయించడం ఇప్పటిదాక చూశాం. కొందరు రీల్స్ కోసం పాములపై పైపులతో నీళ్లు పట్టడం కూడా జరుగుతుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి నిజంగానే పాముకు స్నానం చేయించడం వైరల్ గా మారింది. తమిళనాడు రాష్ట్రంలో ఓ వ్యక్తి ఓ మంచి నీటి ట్యాంకు వద్ద స్నానం చేస్తున్నాడు. అతను అదే సమయంలో తన చేతితో ఓ పొడవైన లేత పసుసు రంగులో కనిపిస్తున్న ఓ విష రహిత పామును పట్టుకున్నాడు. అంతేకాదు.. ఆ పాముకు హమామ్ సబ్బుతో స్నానం చేయించాడు. పాముకు సబ్బుతో స్నానం చేయించిన అతని చర్య సోషల్ మీడియాలో నెటిజన్లకు విస్మయాన్ని, హాస్యాన్ని కల్గించింది.
“ఈ రాజా ఎవరు?” అనే పోస్టుతో వైరల్ అవుతున్న.. పాముకు స్నానం చేయిస్తున్న వీడియోకు “వేడుక కోసం సబ్బు స్నానం” అని తమిళంలో రాయడంతో పాటు తమిళనటుడు వడివేలు, రజనీకాంత్ చిత్రాలతో కూడిన మీమ్స్‌ను కూడా జతచేసి సోషల్ మీడియాలో వినోదంగా మార్చారు.
யாரு ராசா நீ பாம்புக்கு சோப்பு போட்டு குளிப்பாட்டி விடுற , அதுவும் ஹமாம் சோப்பு வேற.
ஆனா இது புதுசா இருக்குண்ணே.😂😂😂 pic.twitter.com/cvA5PJQ3jr
— Sheik Sikkanthar (@sheik_twitts) July 3, 2026