సింహాలు చెట్లు ఎక్కుతున్నాయ్..వైరల్ గా వీడియో

భారీ మృగరాజు చెట్టు ఎక్కిన అద్భుత దృశ్యం టాంజానియాలో కెమెరాలో బంధమై.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సింహాలు చెట్లు ఎక్కుతున్నాయ్..వైరల్ గా వీడియో

విధాత : వన్యప్రాణుల్లో అతి బలమైన జంతువుగా సింహాన్ని పరిగణిస్తారు. అందుకే దానిని అడవికి రాజుగా చెబుతారు. భారీ ఆకారంతో బలిష్టమైన దేహాదారుఢ్యంతో కూడిన సింహం పెద్దపులి, చిరుత పులి కంటే బలమైనది. సింహాలు సహజంగా చిరుతపులిలాగా చెట్లు..కొండలు ఎక్కలేవు. ఇక మగ సింహాలు అయితే భీకర శారీరాకృతితో బలంగా ఉంటాయి. వాటి బలమైన కండరాలతో కూడిన శరీరం..దాని బరువు నేలపై ఇతర జంతువులపై ఆధిపత్యానికి, వేటలో విజయానికి, భయంకరమైన ఘర్షణలకు అనుగుణంగా ఉంటాయి. అంతేగాని చెట్లు ఎక్కడానికి సింహాల శరీరం పనికిరాదు.

అయితే టాంజానియాలోని లేక్ మాన్యారా నేషనల్ పార్క్‌లోని ఓ మృగరాజు మాత్రం తాను చెట్టు కూడా ఎక్కగలనని నిరూపించిన వీడియో వైరల్ గా మారింది. ఓ భారీ మృగరాజు తన భారీ కాయాన్ని సైతం పట్టించుకోకుండా ఓ చెట్టుపైకి లంఘించి మనిషి ఎక్కినట్లుగా ఆ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. సింహరాజు చేసిన ఈ అద్భుతానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సింహాలు చెట్టు ఎక్కలేవన్న పాత కథకు ఇక కాలం చెల్లినట్లేనంటున్నారు. తాను అడవికి మృగరాజునే కాదు..చెట్టులు..పుట్టలు కూడా ఎక్కగల సింహరాజునంటూ టాంజానీయ సింహం నిరూపించినట్లయ్యిందంటున్నారు.