యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్
సింగూరు డ్యామ్ భద్రత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. జూలైలోగా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలని, జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యాం సేఫ్టీపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ,మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జీ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు, ఈఎన్సీలు, ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సింగూరు డ్యాం సేఫ్టీ పై రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ వెంకటస్వామిలు చర్చించారు. డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత అంశం అని వారు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్ డ్యాం ను పరిరక్షించాలని ఇరిగేషన్ శాఖ అధికారులనుకు ఆదేశించారు. సింగూరు డ్యామ్ సేఫ్టీ నిర్మాణ పనులపై టెక్నికల్ మిటీని నియమించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సింగూర్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఆందోల్ నియోజకవర్గం లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల డీపీఆర్ లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ను సమర్పించాలని ఆదేశించారు. ఉగాదిలోగా పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు శంకుస్థాపన చేయాలి అని, సింగూరు ప్రాజెక్టు సుందరీకరణ, ప్రాజెక్టు పరిరక్షణ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.ఆందోల్ నియోజకవర్గం లో చిన్న నీటి ప్రాజెక్టులైనా చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ SE బి రాజమ్మ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ఇన్చార్జి ఎస్సీ రఘునాథ్ రావు, ఈ ఈ బీమ్, DE నాగరాజ్, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Odisha Young Farmer | కింద చేపల చెరువు.. పైన సొరకాయల సాగు.. ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం
Asst Professors | ఓయూ, కేయూలో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ..! ఏప్రిల్‌లో నోటిఫికేషన్..!!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram