Elephant Attack Tourists In Botswana | బోటులో వెళుతున్న వారిపై గజరాజు దాడి.. వీడియో వైరల్

బోటులో ఉన్న పర్యాటకులపై బొత్స్వానాలో ఆఫ్రికన్ ఏనుగు దాడి, వారంతా నీటిలో పడిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు

Elephant Attack Tourists In Botswana | బోటులో వెళుతున్న వారిపై గజరాజు దాడి.. వీడియో వైరల్

విధాత: నేలపైన ఉన్న మనుషులపైన గజరాజుల దాడి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలిసిందే. అయితే ఓ దేశంలో నదిలో బోటుపై వెలుతున్న వారిపై గజరాజు చేసిన బీభత్స దాడి వైరల్ గా మారింది. బోట్స్వానా దేశంలోని ఒకావాంగో డెల్టాలోని నిస్సార జలాల్లో బోట్లపై విహారిస్తున్న పర్యాటకులపై ఓ భారీ ఆఫ్రికన్ గజరాజు ఆకస్మికంగా దాడి చేసింది. పిచ్చి పట్టిన దానిలా..దూరం నుంచి నీళ్లలోనే పరుగెత్తుకు వచ్చి బోట్లపై దాడి చేసి వారిని తొండంతో పడదోసింది. ఏనుగు దాడిలో పలు బోట్ లు ఫల్టీ కొట్టగా..అందులోని పర్యాటకులు నీటిలో పడిపోయారు. వారంతా బతుకు జీవుడా అనుకుంటూ ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు నీటిలో పరుగెత్తకలేక పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.

బోట్ల సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ..తమ వద్ధ ఉన్న పొడైవన తెడ్ల కర్రలతో భయపెట్టి ఏనుగును నియంత్రించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన వారు పర్యాటకులు తృటిలో తప్పించుకున్నారు గాని..లేకపోతే ఏనుగు దాడికి నలిగి నీళ్లలోనే చనిపోయే వారని ఆందోళన వ్యకం చేశారు. ఒరావాంగె డెల్టా ప్రాంతంతో వన్యప్రాణులను తిలకించే పర్యాటకులు తరుచు వారి బారిన పడుతుండటం ఆందోళన కరంగా మారింది. డెల్టా ప్రాంతంలో ఏనుగులు, సింహాలు, పులులు, చిరుతలు సహా ఇతర క్రూరమృగాలు సంచరించడం చూడటం బాగానే ఉన్నా..అవి పర్యాటకులపైకి దాడికి పాల్పడే సందర్భాలు మాత్రం వారికి ఛావు భయం చూపిస్తున్నాయి.