Ram Charan-Upasana | ట్విన్ పేరెంట్స్ క్లబ్‌లో చేరిన రామ్ చరణ్ – ఉపాసన.. ఇంత‌క‌ముందు ఎవ‌రెవరు ఉన్నారు..!

Ram Charan-Upasana | జ‌న‌వ‌రి 31న‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారనే వార్త మెగా అభిమానులకు నిజంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే 2023లో క్లీంకారా పుట్టిన ఆనందం ఇంకా మిగిలి ఉండగానే ఇప్పుడు ఇద్దరు చిన్నారి వారసుల రాకతో చరణ్ ఇంట్లో ఆనందం రెట్టింపైంది.

  • By: sn |    movies |    Published on : Feb 03, 2026 2:16 PM IST
Ram Charan-Upasana | ట్విన్ పేరెంట్స్ క్లబ్‌లో చేరిన రామ్ చరణ్ – ఉపాసన.. ఇంత‌క‌ముందు ఎవ‌రెవరు ఉన్నారు..!

Ram Charan-Upasana | జ‌న‌వ‌రి 31న‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారనే వార్త మెగా అభిమానులకు నిజంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే 2023లో క్లీంకారా పుట్టిన ఆనందం ఇంకా మిగిలి ఉండగానే ఇప్పుడు ఇద్దరు చిన్నారి వారసుల రాకతో చరణ్ ఇంట్లో ఆనందం రెట్టింపైంది. మెగా ఫ్యాన్స్‌కు ఇది డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే “ట్విన్ పేరెంట్స్ క్లబ్”లో చోటు సంపాదించారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు చూద్దాం.

నయనతార – విఘ్నేష్ శివన్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు 2022లో సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట వారికి ఉయిర్, ఉలగం అనే ప్రత్యేక పేర్లు పెట్టారు. నయనతార తరచుగా తన పిల్లలతో గడిపే మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పండగల సమయంలో ట్రెడిషనల్ డ్రెస్సుల్లో పిల్లలను రెడీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సంజయ్ దత్ – మాన్యత దత్

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ట్విన్ డాడ్. 2008లో మాన్యతను వివాహం చేసుకున్న ఆయన 2010 అక్టోబర్‌లో కవలలకు తండ్రయ్యారు. షహ్రాన్, ఇక్రా అనే పేర్లు పెట్టిన ఈ జంట తమ పిల్లలను చాలా ప్రైవేట్‌గా పెంచుతున్నారు. అప్పుడప్పుడూ కుటుంబంతో గడిపే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

శత్రుఘన్ సిన్హా – పూనమ్ సిన్హా

బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రుఘన్ సిన్హా దంపతులకు 1983లో లవ్, కుష్ అనే ఇద్దరు అబ్బాయిలు కవలలుగా జన్మించారు. రామాయణంలోని పాత్రల పేర్లను తమ పిల్లలకు పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తరువాత 1987లో సోనాక్షి సిన్హా జన్మించింది. ప్రస్తుతం సోనాక్షి బాలీవుడ్‌లో ప్రముఖ నటి‌గా కొనసాగుతోంది.

సన్నీ లియోన్ – డానియల్ వెబర్

గ్లోబల్ స్టార్ సన్నీ లియోన్‌, డానియల్ వెబర్ దంపతులు ఫ్యామిలీ ప్లానింగ్‌ను విభిన్నంగా అమలు చేశారు. మొదట నిషా అనే పాపను దత్తత తీసుకున్న ఈ జంట, 2018లో సరోగసీ ద్వారా ఇద్దరు మగపిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టారు. సన్నీ తన ముగ్గురు పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

రుబినా దిలైక్ – అభినవ్ శుక్లా

పాపులర్ టీవీ సెలబ్రిటీలు రుబినా దిలైక్, అభినవ్ శుక్లా 2023 డిసెంబర్‌లో కవల ఆడపిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈధా, జీవా అనే పేర్లు పెట్టిన ఈ జంట తమ పిల్లలను ప్రకృతికి దగ్గరగా పెంచాలని నిర్ణయించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తూ పెంచుతున్నారు.

కరణ్ జోహార్

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ 2017లో సరోగసీ ద్వారా కవలలకు తండ్రయ్యారు. ఒక పాప రూహీ, ఒక బాబు యష్ ఆయన జీవితంలోకి వచ్చారు. తన తండ్రి యష్ జోహార్ పేరు బాబుకు పెట్టగా, తల్లి పేరు హీరూ జోహార్‌ను రివర్స్ చేసి రూహీ అని నామకరణం చేశారు. కరణ్ తన పిల్లలతో చేసే ఫన్నీ వీడియోలు నెట్టింట తరచూ ట్రెండ్ అవుతుంటాయి.

ప్రీతి జింటా – జీన్ గుడెనఫ్

బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతి జింటా 2016లో జీన్ గుడెనఫ్‌ను వివాహం చేసుకుని 2021లో సరోగసీ ద్వారా కవలలకు తల్లయ్యారు. జై, జియా అనే పేర్లు పెట్టిన ఈ జంట ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తోంది.

ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు ట్విన్ పేరెంట్స్‌గా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా ఈ క్లబ్‌లో చేరారనే వార్తతో మెగా ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అభిమానుల దృష్టిలో ఇది మెగా ఫ్యామిలీకి మరో స్వర్ణ అధ్యాయంగా మారింది.