Allu Sirish | అట్టహాసంగా జరిగిన అల్లు శిరీష్-నయనిక వివాహం .. వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Sirish | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యువ హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి వేడుక శుక్రవారం (మార్చి 6, 2026) సాయంత్రం హైదరాబాద్ నగరంలోని కొల్లూరు ప్రాంతంలో ఉన్న ఐనా ఈవెంట్ స్పేస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
Allu Sirish | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యువ హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి వేడుక శుక్రవారం (మార్చి 6, 2026) సాయంత్రం హైదరాబాద్ నగరంలోని కొల్లూరు ప్రాంతంలో ఉన్న ఐనా ఈవెంట్ స్పేస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆహ్వానితుల సమక్షంలో ఈ జంట కన్నుల పండుగగా పెళ్లి చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వధూవరులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి సీఎం ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పెళ్లి వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొని నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ వివాహాన్ని చాలా ప్రైవేట్‌గా నిర్వహించడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.
ఇక అల్లు శిరీష్ – నయనికల ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే ఉంది. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కుటుంబ కార్యక్రమాల్లో పరిచయం అయిన వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు ఈ సంబంధాన్ని అంగీకరించడంతో ఈ ప్రేమ కథ పెళ్లి బంధంగా మారింది.
పెళ్లికి ముందు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరై ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు.
అయితే ప్రధాన పెళ్లి కార్యక్రమాన్ని మాత్రం అత్యంత ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అల్లు శిరీష్ – నయనికల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటకు మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram