Rajiv Gandhi Sadbhavana Award| సల్మాన్ ఖుర్షీద్ కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సీఎం రేవంత్ రెడ్డి ప్రధానోత్సవం చేశారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid) కు రాజీవ్ గాంధీ సద్భావన(Rajiv Gandhi Sadbhavana Award) అవార్డును సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రధానోత్సవం చేశారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. సల్మాన్ ఖర్షీద్ కు అవార్డు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో శాంతి సమగ్రతలను కాపాడేందుకు బలిదానాలతో గాంధీ కుటుంబం బలిదానాలు చిరస్మరణీయమన్నారు. ఇందీరా, రాజీవ్ గాంధీల స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతాయన్నారు. దేశ ప్రగతికి రాజీవ్ అందించిన సేవల గూర్చి ఎంత చెప్పిన తక్కువేనన్నారు. మహాత్మగాంధీని గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు దేశానికి బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీటీమ్ మారి ఎన్నికల్లో సహకరిస్తుంందని..అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి 8సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం కాకుండా బీజేపీ, బీజేపీ చీకటి ఒప్పందాలతో కుట్రలు చేశాయన్నారు. రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. బీసీ కులగణను పూర్తి చేసి వందేళ్ళ సమస్యకు పరిష్కారం చూపామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.