నక్క తెలివికి..చిరుత చిత్తు..వైరల్ గా వీడియో!
నక్క తెలివికి చిరుత చిత్తు! అడవిలో చెవులు తిరిగే చేజింగ్.. చివరికి నక్క పెట్టిన పన్నాగం వైరల్ వీడియోగా మారింది.

విధాత : వన్యప్రాణులు తమ మనుగడ పోరాటంలో అడవిలో తమకంటే బలమైన జంతువుల బారి నుంచి తప్పించుకుంటు మనుగడ సాగించడంలో రకరకాల పాట్లు పడుతుంటాయి. అయితే అడవిలో జీవించే నక్క తెలివైన జంతువుగా భావిస్తుంటారు. అందుకే మోసాలు..ఎత్తులు..జిత్తులు వేసే వారిని ఉద్దేశించి నక్క జిత్తులు అనే మాట నానుడిగా నిలిచింది. ఇకపోతే చిరుత జంతువుల్లో కెల్లా వేగంగా పరుగెత్తే జంతువు. ఓ అడవిలో నక్క, చిరుత ఎదురుపడగా..నక్కను వేటాడేందుకు చిరుత దాని వెంట పడింది. సహజంగా అయితే ఆ నక్క చిరుత బారి నుంచి తప్పించుకోలేక దాని నోటికి చిక్కిపోయేదే. అయితే తెలివైన నక్క ఇక్కడే దాని బుర్రకు పని చెప్పింది.
చిరుతకు చిక్కకుండా ఓ పొద చుట్టు గుండ్రంగా పరుగెత్తడం మొదలు పెట్టింది. నక్క తెలివి అర్ధంకాని చిరుత దాని వెంట ఆ పొద చుట్టు పరుగెత్తుతునే ఉంది. అలా కొన్ని రౌండ్లు ఆ రెండు జంతువులు పరుగెత్తాయి. అకస్మాత్తుగా నక్క మధ్యలో పొద చుట్టు తిరగడం మానేసి చిరుతకు దొరకకుండా దూరంగా పారిపోయే ప్రయత్నం చేసింది. రూట్ మార్చిన నక్క వెంట పడినప్పటికి అది అప్పటికే అందకుండా పారిపోయింది. ఈ ఘటన నక్క తెలివికి నిదర్శనంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎంతైన నక్క తెలివే తెలివని..ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చనేందుకు ఈ ఘటన చాటుతుందని కామెంట్లు పెడుతున్నారు.