Revanth Reddy| యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్ : సీఎం రేవంత్ రెడ్డి
యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్ అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు వంటివారన్నారు. యాదవులు ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించుకునే సదర్ సమ్మెళనంను రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

విధాత, హైదరాబాద్ : యాదవులు ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించుకునే సదర్ సమ్మెళనం(Hyderabad Sadar festival 2025)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్ అని అభివర్ణించారు. యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు వంటివారన్నారు. తెలంగాణ ఏర్పాటులో, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నాం అని గుర్తు చేశారు.
సంక్షేమంలోనూ రాజకీయాల్లోనూ యాదవులకు సముచిత స్థానం(Yadav community development) కల్పిస్తాం అని తెలిపారు. కొన్నిసార్లు ఆలస్యమైనా సరే.. అవకాశాలు కల్పించి సముచిత గౌరవం అందిస్తాం అన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా.. ప్రభుత్వం వద్దకు రండి..మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్దిలో యాదవ సోదరుల సహకారం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. మీ సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ సందర్బంగా సదర్ సమ్మేళనంలో రాష్ట్రంతో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భారీ దున్నరాజుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.