Harish Rao SIT inquiry| ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ రామచందర్ రావుతో సిట్ విచారణకు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే సిట్ అధికారులు హరీష్ రావును మాత్రమే విచారణకు అనుమతించారు. ప్రస్తుతం సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం హరీష్ రావును విచారిస్తుంది.

Harish Rao SIT inquiry| ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ రామచందర్ రావుతో సిట్ విచారణకు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే సిట్ అధికారులు హరీష్ రావును మాత్రమే విచారణకు అనుమతించారు. ప్రస్తుతం సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం హరీష్ రావును విచారిస్తుంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు ఈ సందర్భంగా సిట్ కు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టి.ప్రభాకర్ రావు సహా ఇతర నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ల ఆధారంగా ఆయనను సిట్ ప్రశ్నిస్తుంది

డైవర్షన్ పాలిటిక్స్ కోసమే నన్ను విచారణకు పిలిచారు : హరీష్ రావు

బోగ్గు కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయట పెడితే.. సాయంత్రంకల్లా నోటీసు ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు. విచారణకు వెళ్లేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టా, వారి అవినీతి బండారం బయట పడితే.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడని విమర్శించారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కున్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కున్నాం అని, మేము ఏ తప్పూ చేయలేదు, భయపడం.. చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డే ఉన్నాడని, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే బొగ్గు స్కాంపైన వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాననని హరీష్ రావు తెలిపారు. దీనిపై కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లుగా వెల్లడించారు.