Asifabad municipality | నిన్నటి వరకు బజ్జీల బండి విక్రేత.. ఇప్పుడిక మున్సిపాలిటీ కౌన్సిలర్..
Asifabad municipality | రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో భార్యాభర్తలు, తోడి కోడళ్లు, అత్తాకోడళ్లు, తండ్రితనయులు గెలుపొందారు. ఓ బజ్జీల బండి విక్రేత కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందింది. ఆమె ఎవరంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని గుబిడే నాగుబాయి.
Asifabad municipality | రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో భార్యాభర్తలు, తోడి కోడళ్లు, అత్తాకోడళ్లు, తండ్రితనయులు గెలుపొందారు. అంతేకాదు.. సాధారణ కూలీలు, స్వీపర్లు కూడా విజయం సాధించారు. ఆ మాదిరిగానే ఓ బజ్జీల బండి విక్రేత కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందింది. ఆమె ఎవరంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని గుబిడే నాగుబాయి.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధికి చెందిన గుబిడే నాగుబాయి.. మొదట్లో ఇళ్లల్లో సహాయకురాలిగా పని చేసేది. కొంతకాలం క్రితం ఆ పనికి స్వస్తి పలికి.. సొంతంగా బజ్జీల బండిని ఏర్పాటు చేసుకుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం వేడివేడి బజ్జీలను విక్రయించేది. అయితే ఈ మున్సిపాలిటీలోని 19వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో.. గుబిడే నాగుబాయిని పోటీలోకి దింపాలని యువత నిర్ణయించారు. ఆమెను ఒప్పించి మెప్పించి ఎన్నికల రంగంలోకి దింపి.. బీఆర్ఎస్ తరపున పోటీ చేయించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 58 ఓట్ల మెజార్టీతో నాగుబాయి గెలుపొందింది. గూడెంలో ప్రతి ఒక్కరి అవసరాల్లో ముందుండే ఆమె.. దుర్గా, శారదాదేవి విగ్రహాల ప్రతిష్ఠ సమయంలో స్థానికుల్ని ముందుండి నడిపించేవారు.
కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోలేకపోయాయి. మొత్తం 20 వార్డులున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 9 స్థానాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, 7 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఈ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎవరికైతే మద్దతు ఇస్తారో.. వారే మున్సిపాలిటీని కైవసం చేసుకోనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram