Revanth -Chiru | దావోస్‌లో కలుసుకున్న రేవంత్, చిరు.. మీ మూవీ చూసి ఆస్వాదించానంటూ కామెంట్
Revanth -Chiru | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు.
Revanth -Chiru | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో-అప్ సదస్సును నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. దావోస్‌లో నిర్వహించిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ వ్యాపార నేతలు, పాలసీ మేకర్లు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న తరుణంలో.. పెట్టుబడుల నిర్ణయాలకు ఏడాది పాటు గ్యాప్ ఉండటం అనవసర ఆలస్యానికి దారితీస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. దావోస్‌లో జరిగే చర్చలు, ఒప్పందాలను త్వరగా అమలులోకి తీసుకురావాలంటే హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం అవసరమని ఆయన వివరించారు. ఇలా చేస్తే పెట్టుబడిదారుల నిర్ణయాలు వేగంగా కార్యరూపం దాల్చడంతో పాటు రాష్ట్రానికి కూడా ప్రత్యక్ష లాభం చేకూరుతుందని WEF ప్రతినిధులకు వివరించారు.
ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి సీఎం ప్రస్తావించారు. ఆ సదస్సు ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని గుర్తు చేశారు. గతంలో దావోస్‌కు ఎంవోయూల కోసం మాత్రమే వచ్చేవాళ్లమని, కానీ ఈసారి తెలంగాణ విజన్, ప్రజా ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించడమే లక్ష్యంగా వచ్చినట్లు చెప్పారు.
హైదరాబాద్ వేగంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCCs) హబ్‌గా ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, ఏఐ రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా నైట్ టైమ్ ఎకానమీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, 24 గంటలు చురుకుగా పనిచేసే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. సినీ, సాంస్కృతిక రంగాల నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు లభిస్తోందని ఇది సూచిస్తుండగా, చిరంజీవి ఏదైనా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారా అనే ఆసక్తికర చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ చిరు సినిమా చూసానని, చాలా ఆస్వాదించానని చెప్పినట్టు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram