ఇదిగో.. ఇదే ‘విశ్వంభరు’డి కథ.. ఉగాదికి మెగా సంబరం?

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో భారీ సంచలనం సృష్టించబోతున్నారు. ఊహకు అందని ఓ ప్రయాణంతో, మైమరిపించే దృశ్యాలతోనే కాక, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు కూడా కలగలిపిన ఫాంటసీ కథాచిత్రం ఇది.  ఉగాది సందర్భంగా ప్రత్యేక టీజర్​తో విడుదల తేదీ ప్రకటనకు సిద్ధమవుతున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఇదిగో.. ఇదే ‘విశ్వంభరు’డి కథ.. ఉగాదికి మెగా సంబరం? హనుమాన్ విగ్రహం ముందు మహత్తరంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి – ‘విశ్వంభర’లో దైవిక నేపథ్యానికి సంకేతం.

Vishwambhara Release Date on Ugadi? Chiranjeevi’s Celestial Fantasy Set for Grand Summer 2026 Launch

విశ్వంభర స్వర్గలోకానికి సాహసయాత్ర

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రం భూమి నుంచి స్వర్గం వరకు సాగే విభిన్న సాహసయాత్రా గాథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన భార్యను రక్షించేందుకు స్వర్గలోకానికి ప్రయాణించే కథానాయకుడి భావోద్వేగ యాత్ర ఈ చిత్రానికి ప్రాణం. ఉగాది సందర్భంగా స్పెషల్​ గ్లింప్స్​తో విడుదల తేదీ ప్రకటించే అవకాశమున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

 

  • మెగాస్టార్ చిరంజీవి విశ్వరూపాన్ని ఆవిష్కరించనున్న విశ్వంభర
  • సృష్టి–స్థితి–లయ భావనలతో వశిష్ట నడిపించిన విశిష్ట గాథ
  • కళ్లు మిరుమిట్లుగొలిపే అంతర్జాతీయ స్థాయి విజువల్​ ఎఫెక్ట్స్​
  • ఉగాదికి అద్భుతమైన దృశ్య దర్శనం – జులై 9న విడుదల?

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

చిరంజీవి విశ్వంభర: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం మళ్లీ ఆయనను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘బింబిసార’తో మంచి పేరు తెచ్చుకున్న మల్లిడి వశిష్ట ఈ చిత్రాన్ని అద్భుతమైన కథా నేపథ్యంతో రూపొందిస్తున్నారు. “మన శంకరవరప్రసాద్​ గారు” అఖండ విజయం తర్వాత చిరంజీవికి మరో ఘనవిజయం తథ్యమని సినీవర్గాల అంచనా.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్​ సంస్థ దాదాపు రూ.230 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా విజువల్​ ఎఫెక్ట్స్​పై చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మొదట విడుదలైన టీజర్‌పై వచ్చిన విమర్శలు, అభిప్రాయాల తర్వాత ప్రతి దృశ్యాన్ని మరింత నాణ్యతతో తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. విదేశీ చిత్రాల స్థాయిలో కనిపించేలా గ్రాఫిక్స్ రూపకల్పన చేసారని  సమాచారం. పలు అంతర్జాతీయ గ్రాఫిక్స్​ స్టుడియోలు దీన్లో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే కథ : భువి నుంచి దివికి.. కథానాయకుడి సాహస యాత్ర

రెక్కల గుర్రంపై చిరంజీవి… ఇదే విశ్వంభర అసలు రూపమా? ఉగాది అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆతృత

రెక్కల గుర్రంపై స్వర్గంలోకి అడుగుపెడుతున్న చిరంజీవి… ఇదేనా ‘విశ్వంభర’ అసలు ప్రపంచం? – AI generated

విశ్వంభర’ కథ ఒక సాధారణ మనిషి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అతని భార్య(త్రిష) అనుకోని పరిస్థితుల్లో ఆపదలో చిక్కుకోగా, ఆమెను రక్షించేందుకు హీరో భూలోకం నుండి స్వర్గలోకానికి బయలుదేరతాడు. ఆమె పాత్ర స్వర్గలోకానికి చెందిన అప్సరసను తలపించేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథలో ప్రధాన సంఘర్షణ ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఎదుర్కొనే పరిస్థితులే కథకు మలుపు తీసుకువస్తాయని సమాచారం.

రెక్కల గుర్రంపై స్వర్గానికి చేరే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అక్కడ దైవిక శక్తులు, ప్రతికూల శక్తులతో జరిగే యుద్ధాలు కథలో కీలక భాగం. ఇది పునర్జన్మ కథ కాదు. పూర్తిగా కల్పితమైన, భావోద్వేగాలతో ముడిపడిన సాహసగాథగా నడుస్తుంది. తరువాత తన భార్యతో పాటు ఒక పది సంవత్సరాల బాలుడిని వెంట తీసుకుని తిరిగి భూమికి వస్తాడు. ఆ బాలుడెవరు? అతడి జననం వెనుక ఉన్న రహస్యం, కుటుంబ బంధాల విలువ, త్యాగం వంటి అంశాలు కథకు మరింత గాఢతను కల్పిస్తాయి. సృష్టి–స్థితి–లయ భావనలతో ముడిపడిన ఈ గాథలో చిరంజీవి విభిన్న రూపంలో కనిపించనున్నారు.

భారీ వ్యయం.. ప్రముఖ నటీనటులు.. సంగీత మాధుర్యం

విశ్వంభర సెట్స్‌లో చిరంజీవి, త్రిష, ఎం ఎం కీరవాణి – భారీ సోషియో ఫాంటసీకి రెడీ టీమ్

‘విశ్వంభర’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా – చిరంజీవి, త్రిష, సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి.

ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ బహుమతి గ్రహీత ఎంఎం.కీరవాణి అందిస్తున్నారు. ఆయన స్వరాలు ఈ చిత్రానికి ప్రత్యేక శోభ తీసుకురానున్నాయి. ముఖ్యంగా స్వర్గ దృశ్యాలు, యుద్ధ సన్నివేశాలకు ఆయన నేపథ్య సంగీతం వన్నె తెస్తుందని భావిస్తున్నారు.

స్వర్గలోక దృశ్యాలు, రకరకాల దివ్యాయుధాలు, భారీ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి దృశ్యాన్ని అత్యున్నత నాణ్యతతో అందించాలనే ఉద్దేశంతో చిత్రబృందం నిరంతరం శ్రమిస్తోంది.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహా ఫాంటసీ వినోదంతో పాటు, ‘హిట్లర్’ చిత్రంలో కనిపించిన కుటుంబ అనుబంధ భావోద్వేగం కూడా ఇందులో ప్రధానంగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఉగాదికి స్పెషల్​ గ్లింప్స్​.. విడుదల తేదీ ప్రకటన

రూ.230 కోట్ల విశ్వంభర పోస్టర్‌లో దివ్యాయుధంతో మెగాస్టార్ చిరంజీవి – జూలై విడుదల సన్నాహాలు

దివ్యాయుధంతో సముద్రతీరంలో వీరుడిగా మెగాస్టార్ చిరంజీవి – ‘విశ్వంభర’లో స్వర్గయాత్ర సన్నివేశం.

తాజా సమాచారం ప్రకారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా విశ్వంభర నుండి ఒక ప్రత్యేక విజువల్​ను విడుదల చేసి, అందులోనే విడుదల తేదీని ప్రకటించే యోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. ఆ దృశ్యంలో మెగాస్టార్ విశ్వరూపం, అద్భుతమైన విజువల్​ ఎఫెక్ట్స్​ ప్రధానంగా కనిపిస్తాయని చెబుతున్నారు.

2026 వేసవిలో, ముఖ్యంగా జూలై 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మనకు గ్లింప్స్​ ద్వారానే తెలియనుంది. ఉగాది సందర్భంగా వచ్చే ఆ ప్రత్యేక విజువల్​ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల థియేటర్లలో భారీ ఉత్సాహం కనిపించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘విశ్వంభర’ మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూస్తే, సోషియో ఫాంటసీ చిత్రాలలో ఇది ఒక గొప్ప మైలురాయిలా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.