Nani | ‘జడల్ జమానా’ సోషల్ మీడియాలో దుమారం… నాని సాంగ్ తర్వాత మన హీరోలందరికి జడల్ తగిలించారుగా..!
Nani | సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా తెలుగు ట్విట్టర్ యువత ఒక టాపిక్ పట్టుకుంటే అది వైరల్ అయ్యే వరకు వదలదు. ఇప్పుడు అలాంటి కొత్త ట్రెండ్‌గా ‘జడల్ జమానా’ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ జడలతో దర్శనమిస్తున్నారు.
Nani | సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా తెలుగు ట్విట్టర్ యువత ఒక టాపిక్ పట్టుకుంటే అది వైరల్ అయ్యే వరకు వదలదు. ఇప్పుడు అలాంటి కొత్త ట్రెండ్‌గా ‘జడల్ జమానా’ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ జడలతో దర్శనమిస్తున్నారు. ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం నాచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ది పారడైజ్ నుండి రీసెంట్‌గా ‘ఆయా షేర్’ అనే ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు ‘జడల్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో నాని రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా విడుదలైన పాటలో జడల్ పాత్రను మరింత ఎలివేట్ చేశారు.
‘ఆయా షేర్’ పాటకు అనిరుధ్ రవిచందర్ అందించిన ట్యూన్ యువతకు బాగా ఎక్కేసింది. పాటలో జడలు వేసుకొని నాని చేసిన డ్యాన్స్, సిగరెట్ వెలిగిస్తూ వేసిన హుక్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ లుక్‌కు ఫిదా అయిన అభిమానులు తమ అభిమాన హీరోల ఫోటోలకు కూడా ఎడిటింగ్ ద్వారా జడలు జతచేసి పోస్టులు పెడుతున్నారు. కొందరు డీపీలుగా పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్‌ను వినియోగించుకుంటున్నారు.చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల ఫోటోలకు జడలు జతచేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. హీరోలే కాదు… కమెడియన్లు, రాజకీయ నాయకుల ఫోటోలను కూడా ‘జడల్ లుక్’లో మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “జడల్ అంటే హడల్” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
జడల్ జమానాలో వస్తున్న ఫన్నీ మీమ్స్ చాలా మందిని నవ్విస్తున్నాయి. అయితే కొందరు నెటిజన్లు ఇతర హీరోలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుండటం ఫ్యాన్ వార్స్‌కు దారితీస్తోంది. సరదాగా, వినోదంగా ఉంటే ఇలాంటి ట్రెండ్స్ అందరికీ ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఇతరులను కించపరచే విధంగా మారితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జడల్ జమానా’ ట్రెండ్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram