Telangana High Court | పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు

ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు! పెండింగ్ జరిమానాల కోసం వాహనాలను సీజ్ చేయవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. అటు సీఎం రేవంత్ రెడ్డి 'ఆటో డెబిట్' ప్రతిపాదనతో కొత్త చర్చ మొదలైంది.

Telangana High Court | పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు

విధాత, హైదరాబాద్ : వాహనదారులను పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్లు చెల్లించమని బలవంతపెట్టవద్దని తెలంగాణ హైకోర్టు పోలీస్ శాఖను ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్‌ కీస్‌ లాక్కోవడం, వాహనాన్ని సీజ్ చేయడం వంటివి చేయవద్దని స్పష్టం చేసింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే వసూలు చేసుకోవచ్చని, చెల్లించని పక్షంలో నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో వాహనదారుల పట్ల పోలీసుల జులుం తగ్గే అవకాశం ఉండే అవకాశం ఉందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఓ వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ట్రాఫిక్ చలాన్లను పెండింగ్ లో పెట్టకుండా, రాయితీలు వంటివి లేకుండా చలాన్లు విధించగానే వాహనదారుల బ్యాంక్ ఖాతాల నుంచి కట్ అయ్యేలా చర్యలు తీసుకరావాలని వ్యాఖ్యానించడం ఈ సందర్బంగా గమనార్హం. సీఎం వ్యాఖ్యలు చలాన్ల నిర్బంధ వసూళ్లను ప్రేరేపించేలా ఉండగా..హైకోర్టు మాత్రం అందుకు విరుద్దంగా ఆదేశాలివ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి :

Allu Arjun | అల్లు-మెగా వార్ న‌డుమ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్.. బాస్ బ‌స్ట‌ర్..!
Stock Market Crash | స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..ఒక్క రోజులోనే రూ.9లక్షల కోట్ల సంపద హుష్ !