• Telugu News
  • /Telangana

మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డికి రెండేండ్ల పొడిగింపు

మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డిని మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Feb 25, 2026, 7:58 pm IST
Read Time: 2 mins
మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డికి రెండేండ్ల పొడిగింపు

సీనియర్‌ పాత్రికేయులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కే శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25.02.2026 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్ల క్రితం మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం 24, ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఆయననే మరో రెండేళ్లు ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి కొత్త చైర్మన్‌ ఎంపికపై అనేక ఊహాగానాలు వెలువడినప్పటికీ.. అంతిమంగా శ్రీనివాస్‌రెడ్డిని కొనసాగించేందుకే ముఖ్యమంత్రి ఆసక్తి చూపారు.