Working Journalists | మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి.. ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను కోరిన ఆర్టిస్టులు
Working Journalists | హైదరాబాద్‌లోని వివిధ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
Working Journalists | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని వివిధ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా బి శ్రవణ్ కుమార్, భాను ప్రసాద్ సింగీతం ఆధ్వర్యంలోని వివిధ శాఖల ఉద్యోగులు కె శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
నగరంలోని వివిధ వార్తాపత్రికలలో పనిచేస్తున్న ఉద్యోగులు వార్తాపత్రికల ప్రచురణలో తమ పాత్రల ప్రాముఖ్యతను తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్టులతో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు టి.కోటిరెడ్డి తమ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఆర్టిస్టులు, లైబ్రేరియన్లు, స్కానింగ్ ఆపరేటర్లు అందరూ న్యూస్‌రూమ్‌లలో అంతర్భాగమని, వార్తాపత్రికల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టులుగా ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లందరికీ అర్హులైన అన్ని సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram