Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే బెట‌ర్..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Feb 26, 2026 5:20 AM IST
Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే బెట‌ర్..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి దైవబలం సహకరిస్తుంది. కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంలో కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు ముఖ్యంగా కళాకారులు, రచయితలకు కలిసి వస్తుంది. అందివచ్చిన అవకాశాలు వినియోగించుకుని ఉత్తమమైన సృజనకి శ్రీకారం చుట్టండి. ఆర్థిక వ్యవహారాల్లో నిదానం వహించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. వ్యాపారంలో స్థిరనిశ్చయంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. దైవానుగ్రహంతో ఆదాయమార్గాలు విస్తరిస్తాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలున్నప్పటికీ పట్టుదలతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కీలక వ్యవహారాల్లో స్వీయ నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు, అపార్థాలు రాకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లారు. వృథా ఖర్చులు నివారించండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన సమయం. వృత్తి పరమైన శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. ధనధాన్య లాభాలున్నాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. బుద్ధిబలంతో కొన్ని కీలక వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నంతోనే విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులన్నీ సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అర్థలాభం ఉంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. వృత్తిఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో విశేషమైన ధనలాభాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనం, ఓర్పు తగ్గకుండా చూసుకోండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తి కావాలంటే పట్టుదల అవసరం. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకుని శాంతంగా ఉంటే మంచిది. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలాన్ని అందిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు పనిచేస్తాయి. ప్రయాణాలు చేయకూడదు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా మీ అంచనాలు తప్పవచ్చు. అనారోగ్య సమస్యలతో శక్తి, ఉత్సాహం కొరవడుతుంది.