Khammam Dalit houses demolition| అభిృద్ది కోసం మా భూములే పోవాలా? : ఖమ్మం దళితుల నిలదీత!
మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని..బతుకులు బాగుపడుతాయన్న ఆశతో రేవంత్ రావాలి..శీనన్న(పొంగులేటి) గెలవాలని కాంగ్రెస్ కు ఓటేస్తే మా భూములు లాక్కుని, మా ఇండ్లు కూల్చేశారంటూ ఖమ్మం దళితులు భగ్గుమంటున్నారు.
విధాత : మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని..బతుకులు బాగుపడుతాయన్న ఆశతో రేవంత్ రావాలి..శీనన్న(పొంగులేటి) గెలవాలని కాంగ్రెస్ కు ఓటేస్తే మా భూములు లాక్కుని, మా ఇండ్లు కూల్చేశారంటూ ఖమ్మం దళితులు భగ్గుమంటున్నారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో పదేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న దళితులు, పేదల ఇండ్లను అధికారులు కూల్చివేశారు. వందలాది మంది పోలీసులు, జేసీబీలతో అధికారులు ఇండ్లను కూల్చేందుకు చర్యలు చేపట్టారు. రేకుల షెడ్లు, గుడిసెలను తొలగించారు. తమ ఇండ్లను కూల్చొద్దంటూ స్థానిక పేదలు, దళితులు వేడుకున్నారు. వెలుగుమట్లలోని 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకున్నారు.
తాము పదేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఇప్పుడు తమ ఇండ్లను కూల్చేస్తే మేము ఎక్కడికి వెళ్లాలంటూ అధికారులను ప్రశ్నించారు. శీనన్న గెలిస్తే..రేవంత్ ప్రభుత్వం వస్తే మాకు ఇండ్లు కట్టిస్తారనుకుంటే…ఇప్పుడు ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ వాపోయారు. ఇప్పటికే తాము రెండు సార్లు ఇళ్లను పునర్ నిర్మించుకున్నామని, మళ్లీ కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, బాధితులను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా సామాన్లు తరలించారు. తమకు పక్కా ఇండ్లు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని లేదంటే మా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
మా భూములే దొరికాయా అంటూ ఆగ్రహం
ఎక్కడ డ్యామ్ కట్టినా, రోడ్డు వేసినా, ఫ్యాక్టరీ పెట్టినా , అభివృద్ధి పనులు చేయాలన్నా దళితుల భూములే ఎందుకు పోతాయి? ఖమ్మం మొత్తంలో కూల్చనీకి దళితుల ఇండ్లే దొరికినయా? అంటూ ఈ సందర్బంగా వెలుగుమట్ల దళితులు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వివాదంపై ప్రభుత్వ వైఖరి పట్ల విమర్శలు కొనసాగుతున్నాయి.
డ్యామ్ కట్టినా
రోడ్డు వేసినా
ఫ్యాక్టరీ పెట్టినా
అభివృద్ధి పనులు చేయాలన్నా
దళితుల భూములే ఎందుకు పోతాయి?
ఖమ్మం మొత్తంలో కూల్చనీకి దళితుల ఇండ్లే దొరికినయా?
చెప్పు @revanth_anumula మాదిగ? pic.twitter.com/UTNdD3HUC2— Tony Bekkal 🐘 (@tonybekkal) February 24, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram