Lunar Eclipse : సంపూర్ణ చంద్రగ్రహణం యాదగిరిగుట్ట ఆలయం మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసి, సోమవారం ఉదయం తిరిగి తెరవనున్నారు.

Lunar Eclipse : సంపూర్ణ చంద్రగ్రహణం యాదగిరిగుట్ట ఆలయం మూసివేత

విధాత : ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన, ఉప, అనుబంధ ఆలయాలను ఆ రోజు మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చన నిర్వహించనున్నారు.

ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. ఆ తర్వాత తలుపులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాల బ్యాచ్ రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని తెలిపారు.