Zodiac Sings | వీడిన ‘చంద్ర గ్రహణం’.. ఈ 6 రాశుల వారికి 6 నెలల పాటు డబ్బే డబ్బు..!
Zodiac Sings | ఈ ఏడాదిలో ఏర్పడిన చివరి చంద్ర గ్రహణం( Lunar Eclipse ).. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు వీడింది. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. ఈ చంద్ర గ్రహణం వేళ 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి( Earth ) నీడనే చంద్రుడు( Moon ) ఉన్నాడు. మొత్తానికి చంద్ర గ్రహణం వీడడంతో ఈ 6 రాశుల( Zodiac Signs ) వారికి 6 నెలల పాటు ఊహించని విధంగా డబ్బు సమకూరనుంది. ఈ 6 రాశుల వారు అష్టైశ్వర్యాలను సొంతం చేసుకోనున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ ఆరు రాశులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Zodiac Sings | ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 11 గంటలకు నుంచి అర్ధరాత్రి 12.22 గంటలకు సంపూర్ణ చంద్ర గ్రహణం( Lunar Eclipse ) కొనసాగింది. కుంభ రాశి (Aquarius)లో ఏర్పడిన ఈ చంద్ర గ్రహణాన్ని రాహు గ్రస్త చంద్రగ్రహణం అని పండితులు అభివర్ణించారు. ఇలా ఏర్పడే చంద్ర గ్రహణం కారణంగా.. కొన్ని రాశులకు( Zodiac Signs ) చెందిన వ్యక్తుల జీవితాల్లో ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, డబ్బు సమకూరుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ ఆరు రాశుల్లో మీ రాశి ఉందో తెలుసుకోండి.
మేష రాశి( Aries )
చంద్ర గ్రహణం వీడడంతో మేష రాశి వారికి ఇక శుభ సమయం వచ్చింది. ఆర్థిక లాభాలు విపరీతంగా పొందే అవకాశం ఉంది. మొదలు పెట్టిన ప్రతి పని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా.. విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగులకు అయితే భారీగా వేతనాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరికి పూర్వీకుల ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. మొత్తానికి చంద్ర గ్రహణం వీడడంతో మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి( Taurus )
వృషభ రాశి వారికి ప్రధానంగా శుక్ర బలం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. దీంతో ఈ రాశి వారికి అమాంతం సంపాదన పెరిగే అవకాశం ఉంది. కొన్ని గ్రహాలు అనుకూలంగా మారడంతో.. అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. కష్టాలు కూడా తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
తులా రాశి( Libra )
తులా రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే కానుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా సఫలీకృతులవుతారు. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనుల ప్రారంభానికి శుభ సమయం ఇది. భాగస్వామ్య వ్యాపారాలకు మరింత అనుకూల సమయం. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి( Sagittarius )
చంద్ర గ్రహణం వీడడంతో.. ఈ రాశుల వారికి సంబంధించిన ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. లాభాలు గడిస్తారు. తల్లిదండ్రుల సహకారంతో అభివృద్ధి చెందుతారు. తద్వారా సోదరుల మధ్య అనుబంధం పెరుగుతుంది. గురు బలం ఎక్కువగా ఉండడంతో ఈ రాశికి చెందిన యువతీ యువకులకు వివాహలు కుదురుతాయి. శుభవార్తలు వింటారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి( Capricorn )
మకర రాశి వారు కూడా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు నూటికి నూరు శాతం ఫలిస్తాయి. ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడుతాయి. ఖర్చులు కూడా విపరీతంగా చేస్తారు. వస్తువుల కొనే విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి ( Pisces )
చంద్ర గ్రహణం వీడడంతో.. ఈ రాశి వారు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాలా లాభాలను పొందుతారు. అవివాహితులకు పెళ్లిళ్లు కుదురుతాయి. పోటీ పరీక్షలు రాసే స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.