Zodiac Signs | నేడు ధనిష్ఠ నక్షత్రంలోకి కుజుడు.. ఈ ఐదు రాశుల వారికి ధన ప్రవాహమే..!
Zodiac Signs | వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ సంచారం చాలా కీలకమైనది. ఈ ప్రభావం ఇతర రాశుల( Zodiac Signs ) పై కూడా ఉంటుంది. ఈ క్రమంలో కుజుడు( Mars ) ధనిష్ఠ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ముఖ్యంగా 5 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఆ రాశులేమిటో చూద్దాం.
Zodiac Signs | సాధారణంగా గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా గ్రహాలు సంచరించిన ప్రతిసారి.. ఆయా రాశుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మేషం, వృశ్చిక రాశులకు అధిపతి అయిన కుజుడు( Mars ).. తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. ఫిబ్రవరి 19వ తేదీన గురువారం రోజు.. కుజుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కుజ సంచారం వల్ల ఈ ఐదు రాశులకు( Zodiac Signs ) పట్టిందల్లా బంగారమే కానుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడి.. ధన ప్రవాహం కలగనుంది. మరి ఆ ఐదు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
కుజ గ్రహ నక్షత్ర సంచార మార్పు మేష రాశి వారికి అనేక శుభఫలితాలను తీసుకొస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు అందుతాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. రావాల్సిన బకాయిలు అందుతాయి. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి (Cancer)
కుజ గ్రహ నక్షత్ర సంచార మార్పు వల్ల కర్కాటక రాశి వారికి మేలు జరుగనుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు పదోన్నతులకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి.
సింహ రాశి ( Leo )
కుజుడు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించడం కారణంగా సింహ రాశి వారు తిరుగులేని శక్తిగా ఎదగనున్నారు. అనేక విధాలుగా లాభపడనున్నారు. ఆర్థిక విషయాల్లో తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవ, మర్యాదలు పెరగడంతో పాటు అధికార యోగం ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రతి ప్రయాణం కూడా ఫలవంతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి పట్టిదంల్లా బంగారమే కానుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందనున్నారు. వ్యాపారులకు పెండింగ్ పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలన్నీ వసూలవుతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత దృఢమవుతుంది.
మకర రాశి (Capricorn)
మకర రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ముఖ్యంగా అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు ఆర్జిస్తారు. దేశ, విదేశ ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram