Harish Rao allegations| ప్రజలకొక న్యాయం..మంత్రికి, అల్లుడికి మరో న్యాయమా ?: హరీశ్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడికి.. అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు.
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడికి.. అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు. రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటి సంస్థ ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ నిర్వహిస్తున్నారని, సీఎం రేవంత్ అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టారని హరీశ్ రావు ఆరోపించారు.
హైడ్రాకు మంత్రి అక్రమ క్వారీ కనిపించదా ?
పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు.. మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేదు అని హరీశ్ రావు ప్రశ్నించారు. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి, దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండీఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు? అని నిలదీశారు.
ఇతరులు చేస్తే అక్రమం..మంత్రి చేస్తే సక్రమమా?
రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? అని ప్రశ్నించారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? అని హరీశ్ రావు నిలదీశారు. నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? అన్నారు. విద్యుత్ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? అని ప్రశ్నించారు. ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా? అని నిలదీశారు.
ఎవరి వాటాలు ఎంత !
ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? అని హరీశ్ రావు మండిపడ్డారు. క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా..మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? అని, ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు–కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? అని హరీశ్ రావు విమర్శించారు.
బిడ్డింగ్ లేకుండా కేటాయింపులు
ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతాడని.. మరోవైపు అదే ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతాడని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు అన్నారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? అని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ అంటే బిజినెస్’ అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ దనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? అని మండిపడ్డారు.
నాడు ప్రభుత్వ భూములపై మొసలి కన్నీరు..నేడు రియల్ వ్యాపారం
ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చాడని, ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, విక్రయాలు చేస్తున్నాడని హరీశ్ రావు విమ్శించారు. ప్రభుత్వ భూములలోని కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? అని హరీష్ రావు నిలదీశారు.
ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే హైడ్రా ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? అని, శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్‌ట్రక్షన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram