Iran attacks| ఇరాన్‌ దాడులు.. ముగ్గురు భారతీయులు మృతి

పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మృతి చెందారు. ఒమన్‌ తీరంలోని రెండు నౌకలపై ఇరాన్ జరిపిన దాడులలో ముగ్గురు భారతీయులు చనిపోయారని తెలిపారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 03, 2026, 1:53 pm IST
Read Time: 2 mins
Iran attacks| ఇరాన్‌ దాడులు.. ముగ్గురు భారతీయులు మృతి

న్యూఢిల్లీ : పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేపట్టిన ప్రతీకార దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయినట్లు షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. ఒమన్‌ తీరంలోని రెండు నౌకలపై ఇరాన్ జరిపిన దాడులలో ముగ్గురు భారతీయులు చనిపోయారని తెలిపారు. ఈ విషయాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

గల్ఫ్ లోని అమెరికన్ మిత్ర దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం.. 40 మందికి పైగా అమెరికన్ సైనికులు మా దాడుల్లో మృతి చెందినట్లుగా ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్ షిప్పింగ్ జరగకుండా చేస్తామని, అమెరికా మిత్ర దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తామని హెచ్చరించింది. మరోవైపు రానున్న 24 గంటల్లో ఇరాన్ పై భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా యూఎస్‌ అధికారులు వెల్లడించడంతో యుద్దం మరింత తీవ్రతరం కానుండటం ఆందోళన రేకెత్తిస్తుంది.