• Telugu News
  • /Telangana

Tummala Nageswara Rao : దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల !

గల్ఫ్ గగనతలం మూసివేతతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకున్నారు. ఆయన సురక్షితంగా ఉన్నట్లు తెలిపి, విమానాలు ప్రారంభం కోసం వేచి ఉన్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 02, 2026, 3:57 pm IST
Read Time: 4 mins
Tummala Nageswara Rao : దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల !

విధాత : ఇరాన్-ఇజ్రాయెల్ మద్య భీకర యుద్ధ పరిస్థితులతో దుబాయ్ తో పాటు గల్ఫ్ దేశాలు తమ గగన తలాన్ని మూసేశాయి. దీంతో కుటుంబ సభ్యులకు చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు.

మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో, మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన గత ఐదు రోజుల క్రితం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. చికిత్స పూర్తయిన తర్వాత తిరిగి రావాలని భావిస్తున్న సమయంలో పశ్చిమ ఆసియాలో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆయన దుబాయ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే తాను సురక్షితంగా ఉన్నానని, ఎయిర్ పోర్టు క్లియరెన్స్ ఇచ్చే వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తుమ్మల పేర్కొన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతికార దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియాలోని యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, ఇరాక్‌ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతో పాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ క్షిపణుల దాడి చేస్తున్నది. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లోని ఎయిర్‌పోర్టుల్ని మూసివేశారు. దీంతో మంత్రి తుమ్మలతో పాటు 1700 మంది భారతీయులు దుబాయ్ లో చిక్కుకపోయారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఉన్న యూఏఈ ఎంబసీని వారి కుటుంబ సభ్యులు సంప్రదిస్తున్నారు. వారికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

RanaBaali | ‘రణబాలి’ స్టోరీ ఇదేనా.. రాయలసీమ నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ గాథగా విజయ్–రష్మిక చిత్రం
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు

Tags: