Pushpa-3 : పుష్ప-3 ఖచ్చితంగా ఉంటుంది: డైరెక్టర్ సుకుమార్ వెల్లడి

దర్శకుడు సుకుమార్ పుష్ప-3 ఖచ్చితమని వెల్లడి చేశారు. సైమా 2025లో పుష్ప-2 ఐదు అవార్డులు సాధించగా, అభిమానుల్లో పుష్ప-3పై ఆసక్తి పెరిగింది.

Pushpa-3 : పుష్ప-3 ఖచ్చితంగా ఉంటుంది: డైరెక్టర్ సుకుమార్ వెల్లడి

విధాత : బాక్సాఫీస్ బిగ్ హిట్ పుష్ప మూవీ సిరీస్ లో పుష్ప-3 సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుందని దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్ వేదికగా పుష్ప-3 మూవీపై సుకుమార్ కీలక ఆప్డేట్ ఇచ్చారు.
‘పుష్ప-3’ ఉంటుందా అని అడిగిన యాంకర్ ప్రశ్నకు..ఖచ్చితంగా ఉంటుందని సుకుమార్ సమాధానమిచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నెలకొంది. బాక్సాఫీస్ కలెక్షన్లతో అనేక అవార్డులు కొల్లగొట్టిన పుష్ప, సిక్వెల్ పుష్ప 2 మూవీకి కొనసాగింపుగా పుష్ప 3 కూడా రావడం ఖాయమని తేలిపోవడంతో ఈ మూవీ కథ ఎలా ఉంటుందన్నదానిపై అభిమానుల్లో చర్చలు జోరందుకున్నాయి.

ఇకపోతే సైమా అవార్డులలో పుష్ప-2 సినిమాకు ఐదు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు లను సైమా అవార్డులు వరించాయి. అల్లు అర్జున్ సైమా నుంచి ఇప్పటిదాక ఐదు అవార్డులు అందుకోగా..వరుసగా మూడు అవార్డులు అందుకుని హ్యాట్రిక్ కొట్టారు.

సైమా 2025 అవార్డుల విజేతలు వీళ్లే

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ, ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప2), ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2), ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2), ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ), ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2), ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే), ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్‌ (పుష్ప2), ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర), ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ), ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ), ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే), ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌), ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు), ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా (హనుమాన్‌), ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ నటుడు (కన్నడ): కిచ్చా సుదీప్‌, ఉత్తమ నటి (కన్నడ) : ఆషిక రంగనాథ్‌, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌),
ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్‌), ఉత్తమ దర్శకుడు (కన్నడ): ఉపేంద్ర (యూఐ), ఉత్తమ చిత్రం (కన్నడ): కృష్ణం ప్రణయ సఖి.