మెరుగైన న్యాయ సేవలు అందించాలి..హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి
కోర్టులకు వచ్చే కక్షిదారులకు మెరుగైన న్యాయ సేవలు అందించాలని... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు. .జనగామ పట్టణ శివారు చంపక్ హిల్స్ లో 10 ఎకరాల భూమిలో జనగామ జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణ సముదాయాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
జనగామ అక్టోబర్ 18 ( విధాత):కోర్టులకు వచ్చే కక్షిదారులకు మెరుగైన న్యాయ సేవలు అందించాలని… హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు. .జనగామ పట్టణ శివారు చంపక్ హిల్స్ లో 10 ఎకరాల భూమిలో జనగామ జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణ సముదాయాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో కొత్తగానిర్మించే భవనం లో అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. కక్షిదారులు కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించాడానికి కృషి చేయాలనిసూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు సుద్దాల చలపతి రావు, మధుసూదన్ రావు, రాజేశ్వరరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డిసిపి రాజమహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram